Take a fresh look at your lifestyle.

మళ్ళీ తెరమీదికి కేసీఆర్‌ ‌వారసుని పేరు..ఎందుకు?

లోక్‌ ‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ‌వ్యూహాలు తలకిందులయ్యాయి. మోడికి మెజారిటీ రాకపోతే, మూడవ ఫ్రంట్‌ ఏర్పాటులో కింగ్‌ ‌మేకర్‌గా వ్యవహరించాలని కేసీఆర్‌ అనుకున్నారు. అయితే, మోడీ గతంలో కన్నా ఎక్కువ మెజారిటీని సాధించడంతో కేసీఆర్‌ ‌వ్యూహమే కాదు, అందరి వ్యూహాలు తలకిందులయ్యాయి. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఆలోచనలు మూల పడటంతో కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు కూడా తెరవెనక్కి వెళ్ళాయి. మళ్ళ ఇప్పుడు ఆ మాట గట్టిగా వినిపిస్తోంది.

Again name, KCR , ktr, harish rao, trs party new cm, cm seat
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాజకీయ వారసునిగా ఆయన కుమారుడు కెటి రామారావు నియమితులు కానున్నారా? 2019 సెప్టెంబర్‌లో ఈ అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు వొచ్చినప్పుడు కేసీఆర్‌ ‌జవాబు చెప్పకుండా దాటవేశారు. కేటీఆర్‌ ‌తండ్రి రాజకీయ వారసత్వం తీసుకోవడం తథ్యమన్న ఊహాగానాలు వొచ్చిన సమయంలో ఆయన ‘నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను… రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేవ తగ్గకుండా పని చేయగల విశ్వాసం నాకుంది. మధ్యలో నా కుమారుణ్ణి ఎందుకు తీసుకుని వస్తాను?’ అని ప్రశ్నించారు, తన కుమారుడు కెటి రామారావునీ, మేనల్లుడు టి హరీష్‌ ‌రావును మంత్రివర్గంలోకి తీసుకున్న ఎనిమిది నెలల తర్వాత ఈ మాట అన్నారు. అంటే 2018 డిసెంబర్‌లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వొచ్చిన తర్వాత రకరకాల ఊహాగానాలు వ్యాపించాయి. కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై దృష్టిని కేంద్రీకరిస్తారని అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తన కుమారుడు కెటి రామారావును ఎంపిక చేయవచ్చన్న ఊహాగానాలు వ్యాపించాయి. అయితే, లోక్‌ ‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి రావడంతో కేసీఆర్‌ ‌వ్యూహాలు తలకిందులయ్యాయి. మోడికి మెజారిటీ రాకపోతే, మూడవ ఫ్రంట్‌ ఏర్పాటులో కింగ్‌ ‌మేకర్‌గా వ్యవహరించాలని కేసీఆర్‌ అనుకున్నారు. అయితే, మోడీ గతంలో కన్నా ఎక్కువ మెజారిటీని సాధించడంతో కేసీఆర్‌ ‌వ్యూహమే కాదు, అందరి వ్యూహాలు తలకిందులయ్యాయి. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఆలోచనలు మూల పడటంతో కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు కూడా తెరవెనక్కి వెళ్ళాయి. మళ్ళ ఇప్పుడు ఆ మాట గట్టిగా వినిపిస్తోంది. కేసీఆర్‌ ‌కేబినెట్‌లో మంత్రులైన ఎర్రబెల్లి దయాకరరావు, వి శ్రీనివాస గౌడ్‌లు ఈ విషయమై చర్చకు తెరలేపారు. తదుపరి సిఎం కేటీఆర్‌ అం‌టూ సంకేతాలు వొదిలారు.

కొడుకా..మేనల్లుడా..ఎవరి వైపు కేసీఆర్‌ ఉం‌టారు
సెప్టెంబర్‌లో కేసీఆర్‌ ‌తన కుమారుడు పార్టీ వ్యవహారాలు చూసుకుంటారనీ, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా నియమితులైన దృష్ట్యా పూర్తిగా పార్టీకే తన శక్తియుక్తులను వినియోగిస్తారని చెప్పారు. కేటీఆర్‌ను కేబినెట్‌లో రెండవ స్థానానికి ఎంపిక చేయవొచ్చనీ, ఏదో ఒకనాటికి ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు వ్యాపించాయి. ఈ ఊహాగానాలు హరీష్‌ ‌రావుకు మనస్తాపం కలిగించాయి. పార్టీలో పరిణామాలను ఆసరగా చేసుకుని తెరాసను బీజేపీ చీల్చవచ్చని కేసీఆర్‌ ‌భయపడ్డారు. దాంతో తన కుమారునితో పాటు మేనల్లునికి కూడా కేబినెట్‌ ‌పదవి ఇచ్చి అసంతృప్తి సర్దుమణిగేట్టు చేశారు. దయాకరరావు, శ్రీనివాస గౌడ్‌లు కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి అయ్యే అవకాశాల గురించి ఊహాగానాలు వ్యాపింపజేసినా, తెరాసలో ఒక వర్గం నాయకులు వాటిని తోసిపుచ్చారు. ఈ విషయంలో కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్‌ ఏం ‌చేసినా నిర్భయంగానే చేస్తారనీ, పైనో మాట, లోనో మాట ఆయనకు అలవాటు లేదని ఈ వర్గం నాయకులు స్పష్టం చేశారు. అంతేకాక, ఇప్పటికిప్పుడు తన కుమారునికి ముఖ్యమంత్రి పదవిని ఇస్తే కేసీఆర్‌ ‌చిక్కుల్లో పడతారనీ, ముఖ్యంగా, బీజేపీ నాయకులు ఒక వంక రాష్ట్రంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు ఒడిగట్టరని ఆ వర్గం నాయకులు పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో తెరాసకు బాగా బలమున్న నిజామాబాద్‌ ‌సహా నాలుగు లోక్‌ ‌సభ స్థానాలను బీజేపీ గెల్చుకోవడాన్ని ఉదా హరణగా చూపుతు న్నారు. అయితే, దయా కరరావు, శ్రీనివాస్‌ ‌గౌడ్‌ల ప్రకటనలు ముఖ్యమంత్రి మనసులో మాటను తెలియ జేస్తున్నాయని మెజారిటీ నాయకులు అంటున్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న విషయం శాఖల కేటాయింపులో స్పష్టం అవుతోంది. ఈ ఇద్దరు మంత్రుల అభిప్రాయాలు నాయకుని ఆంతర్యాన్ని తెలియజేస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఒకరు అన్నారు. ఈ ఇద్దరు మంత్రుల ప్రకటనలకు పార్టీలో అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని తండ్రి కొడుకులు అనుకుంటున్నట్టు చెబుతున్నారు.

కేటీఆర్‌ ‌మునిసిపల్‌ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ఎ సమ్మిరెడ్డి అనే విశ్లేషకుడు పేర్కొన్నారు. కేటీఆర్‌ ఆధ్వర్యంలో మునిసిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామనీ, సిఏఏ, ఎన్‌ఆర్‌సీలు మతపరమైన విభజన సృష్టించాయనీ, తెరాసకు ఎంఐఎం సహకరించ వొచ్చని ఆయన అన్నారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో కేసీఆర్‌ ‌ప్రతిష్ట తగ్గుతూ వస్తోంది అందుకే కేటీఆర్‌ను తెరమీదికి తీసుకుని రావడం ఎంతైనా మంచిదని పార్టీలో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. పార్టీలో అసమ్మతిని కేసీఆర్‌ అణచివేసినప్పటికీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కమ్మ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు తనను పక్కకు తప్పించారన్న వ్యధతో ఉన్నారు. అలాగే, కడియం శ్రీహరి, తదితర నాయకులూ ఉన్నారు. ఈటెల రాజేంద్ర, హరీష్‌ ‌రావులకు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉంది. హరీష్‌ ‌రావుకి నిజాయితీ పరుడైన నాయకునిగా పేరు ఉంది. అసంతృప్తిపరులకు పిలుపు ఇస్తే వారంతా వొచ్చి ఆయన పక్షాన చేరేందుకు నిమిషం పట్టదు.
– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Tags: Again name, KCR , ktr, harish rao, trs party new cm, cm seat

Leave A Reply

Your email address will not be published.