Take a fresh look at your lifestyle.

ఈ ‌క్రాపింగ్‌ ‌తరవాత రైతుల రిజిస్ట్రేషన్‌ ‌జరగాలి

రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు కావాలి
సక్షలో సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సూచన

అమరావతి, సెప్టెంబర్‌ 29 : ఈ ‌క్రాపింగ్‌ ‌తర్వాత రైతుల రిజిస్ట్రేషన్‌ ‌జరగాలని, తర్వాత లిస్ట్ ఆర్‌బీకేలలో పెట్టాలని సిఎం జగన్‌ ‌సూచించారు. ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్‌లో పక్కాగా ఉండాలి. సోషల్‌ ఆడిట్‌ ‌చేయాలి. మిస్‌ అయితే వెంటనే నమోదుచేయాలన్నారు. ఫామ్‌గేట్‌ అనేది ప్రతీ పంటకూ చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ ‌పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్‌ 15 ‌నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా మన ప్రొక్యూర్‌మెంట్‌ ‌మరింత ఎఫెక్టివ్‌గా పనిచేయాలని, ఈ క్రాపింగ్‌ ‌ప్రతీ పంటకు కంప్లీట్‌ ‌కావాలన్నారు. ఈ క్రాపింగ్‌ ఎక్కడా కూడా పెండింగ్‌ ఉం‌డకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్‌ ‌చేస్తామని చెప్పాలన్నారు. ఎక్కడా కూడా మ్యాన్యువల్‌ ‌సర్టిఫికెట్‌ ఉం‌డకూడదు, ఈ క్రాపింగ్‌ ‌తప్పనిసరిగా జరగాలన్నారు. సీఎం యాప్‌ ‌ద్వారా మానిటరింగ్‌ ‌జరగాలి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ‌వెంటనే అలర్ట్ ‌చేయాలన్నారు.
జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్‌ ‌సౌకర్యం చూపాలన్నారు. ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్‌ 1 ‌న రిలీజ్‌ ‌చేస్తాం.. అక్టోబర్‌ 5 ‌కల్లా అన్ని ఆర్‌బికేలలో డిస్‌ప్లే చేయాలన్నారు. కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్‌కు మనం అమ్మించగలగాలి రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండని అన్నారు. స్టేట్‌లెవల్‌ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్‌బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలన్నారు. ఏ పంట ఏ గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలని, కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారన్నారు.  అలాగే భారీ వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్థితిని సీఎం సక్షించారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఆర్‌బీకే లెవల్‌లో ఎన్యూమరేషన్‌ ఆఫ్‌ ‌ఫార్మర్స్ ‌డిస్‌ప్లే చేయాలన్నారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌ ఆదేశించారు.
సక్షలో మంత్రలు ఆదిమూలం సురేశ్‌, ఆళ్లనాని, బొత్స, పెద్దిరెడ్డి, కన్నబాబు,సిఎస్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply