Take a fresh look at your lifestyle.

తెలంగాణ వచ్చాక అప్పులు పెరిగాయి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల

nirmala-sitaraman

గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌సోమవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రమని.. ఆ తర్వాత క్రమంగా అప్పులు పెరిగాయని అందులో పేర్కొన్నారు.

తెలంగాణకు ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్టాల్ర విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1,916కోట్లు, కేంద్ర గ్రాణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్‌ ‌లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.

Leave a Reply