Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌తర్వాతి సమస్యలను భారత్‌ ఎదుర్కోగలదా?

కోవిడ్‌ -19‌పై పోరులో చిన్న విజయాలతో సరిపెట్టుకోలేం. దీనికి దీర్ఘకాలికమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ముఖ్యంగా దేశంలో కోట్లాది మంది యువకుల భవితను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. దేశ వ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగింపు వల్ల అంతూ పొంతూ లేకుండా కష్టనష్టాలకు ప్రజలు, ఆర్థిక వ్యవస్థ గురి కావడాన్ని చూస్తున్నాం. మన దేసంలో ప్రధానమైన వాహనాల ఉత్పత్తి రంగం రోజుకు 2,300 కోట్ల రూపాయిలను కోల్పోతున్నట్టు ఆ పరిశ్రమకు చెందిన వర్గాలు పేర్గొన్నాయి. అంతర్జాతీయంగా సార్స్- ‌కోవి-2 వచ్చినప్పుడు కూడా ఇదే మాదిరిగా ఎన్నో నష్టాలను భరించాల్సి వచ్చింది. ఇప్పటి వైరస్‌ ‌కూడా అత్యంత ప్రమాదకరమైనది. అందుకే, ప్రధానమంత్రి మోడీ ఎన్నో కఠిన నిర్ణయాలను తీసుకున్నారు.ఇప్పటికీ తీసుకుంటున్నారు. మన దేశ జనాభా 130 కోట్లు. 2019 లెక్కల ప్రకారం మన దేశంలో ఏటా వెయ్యిమందికి ఏడుగురు మరణిస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంఖ్యం మరింత పెరిగింది. ఈ సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించకపోతే ప్రమాదంలో పడతాం.

లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ఉపయోగాలు:
లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగాలను భారీగా సమీకరించేందుకు అవకాశం కలిగింది. అంతేకాక, సాంకేతికంగానూ, మౌలిక సదుపాయాల రీత్యాను ముందడుగు వేయగలిగాం. ఇందుకు ఉదాహరణ ఆరోగ్య సేతు యాప్‌ ‌రూపకల్పన. లాక్‌ ‌డౌన్‌ను మూడోసారి అంటే మే 17 వరకూ పొడిగించారు. దీని వల్ల చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలకు ఉపాధి ఇప్పట్లో లభించే అవకాశాలు లేవు. వేసవి కాలం కనుక పిల్లలు స్కూళ్ళు మూతపడతాయి. దాంతో పెద్ద ఇబ్బంది లేదు. లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగింపు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతినవచ్చు. సామాజిక దూరాన్ని పాటించడం వల్ల మన దేశంలో కొరోనాని అదుపు చేయవచ్చని ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. కొరోనా సోకిన రోగులను గుర్తించడానికి ఆరోగ్య సేతు ఉపయోగ పడుతుంది. కోవిడ్‌ ‌వల్ల మరణా సంఖ్య తగ్గించడానికి స్వీడన్‌ అనుసరించిన విధానాన్ని అనుసరించాలి. పెద్ద వారిని ఈ వ్యాధి బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అదే ప్రధాన సమస్య. ఒకేసారి 20 లక్షల మంది దవాఖానా పాలయితే, తగిన వైద్య సౌకర్యాలు లేవు. కొరోనా రాకుండా చూసుకోవాలి.

సామాజిక దూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లాక్‌ ‌డౌన్‌ ‌తర్వాత కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొరోనాని కట్టడి చేయడానికి రాష్ట్రాలూ, కేంద్రమూ సమన్వయంతో పని చేయాలి. కేసులు పెరగకుండా చూసుకాలి. కొరోనా కేసులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటిస్తున్న దాని కన్నా ఎక్కువ కేసులు ఉండవచ్చు. అందువల్ల వైరస్‌ను కట్టడి చేయడానికి దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాలి. తాత్కాలిక విజయాలతో సరిపెట్టుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక వ్యూహాలు సమగ్రమైనవిగా ఉండాలి. వృద్ధులను రక్షించుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. యువకుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక, వారి సేవలను ఉపయోగించుకోవాలి,మరణాల రేటు తగ్గిచుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక పద్దతులను వినియోగిచుకోవాలి. కేసుల సంఖ్య పెరగకుండా చూసుకోవాలి. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి. మత పరమైన సమావేశాలకు ఎక్కువ మంది హాజరు కాకుండా చూడాలి. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అన్ని స్థాయిల్లో అమలు జరిగేట్టు చూడాలి. కొరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు చాలా చోట్ల ఫలిస్తున్నాయి. తక్కువ ఫలితాలను ఇచ్చే అంశాల్లో భారతీయులు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొరోనా వంటి రోగాల వ్యాప్తి విషయంలో ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరాదు.

-‘ద ప్రింట్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply