Take a fresh look at your lifestyle.

కొరోనా తర్వాత…నిరుద్యోగిగా మారుతున్న గ్రామీణ మహిళ..!

ఆర్థిక ఇబ్బందుల్లో వలస కార్మికులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పడిపోయిన పనిదినాల సంఖ్య
పని దినాల కల్పనలో కేరళలో అత్యధికం 91.38 శాతం, జమ్మూ కాశ్మీర్‌లో అతి తక్కువ 30.72 శాతం 

కోవిడ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఓ వ్యక్తి దొరికే రోజు పనిలో మహిళల వాటా ఈ ఆర్థిక సంవత్సర మొదటి ఐదు నెలల్లో 52.46 శాతానికి పడిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం ఇటువంటి పరిస్థితి నెలకొని వుండింది. సుమారు 13.34 కోట్ల మంది క్రియాశీల ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ‌కార్మికులు దేశంలో ఉండగా, వీరిలో 6.58 కోట్లు అంటే 49 శాతం మహిళలు ఉన్నారు. కొరోనా మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వలస కార్మికులు తమ గ్రామాలకు అధిక సంఖ్యలో తిరిగి వచ్చిన తరువాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారిలో పురుషుల భాగస్వామ్యం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయినా కానీ ఈ పథకంపై ఆధారపడే మహిళల సంఖ్య తగ్గలేదు. ప్రస్తుత సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 280.72 కోట్ల పనిదినాల లక్ష్యానికి చేరుకోవాల్సి ఉండగా ఈ సరికే 183 కోట్లకు పైగా పనిదినాలు ప్రభుత్వం ద్వారా కల్పించబడ్డాయి. దీని ఆధారంగా మనం గ్రామీణ భారతదేశ ప్రజల బాధను అర్ధం చేసుకోవచ్చు.

18 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొత్తం పని దినాల వాటాలో మహిళల వాటా తగ్గింది. 14 రాష్ట్రాలలో స్వల్పంగా పెరిగాయి.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళల పనిదినాల వాటా క్షీణత జాతీయంగా సగటు 2.24 శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ‌లో 3.58% మహిళల పనిదినాలు పడిపోయాయి. అంటే గత ఏడాది 60.05% పనిదినాలు మహిళలలకి అందగా ఈ ఏడు 56.47%కు పడిపోయింది. పశ్చిమ బెంగాల్‌ (3.32), ‌తెలంగాణ (2.62), హిమాచల్‌ ‌ప్రదేశ్‌ (2.44) . ‌ఛత్తీస్ఘర్‌, ‌జార్ఖండ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, ‌మేఘాలయ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, ‌సిక్కిం, బీహార్‌, ‌రాజస్థాన్‌, ‌జమ్మూ కాశ్మీర్‌, అం‌డమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులలో మహిళల పనిదినాలు తగ్గిన రాష్ట్రాల జాబితాలో నమోదు అయ్యాయి. మహిళల పనిదినాలు వాటా పెరిగిన రాష్ట్రాల్లో మిజోరం, మధ్యప్రదేశ్‌, ‌మణిపూర్‌, ‌గుజరాత్‌, ‌కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, నాగాలాండ్‌, అస్సాం, కర్ణాటక, పుదుచ్చేరి, గోవా, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌త్రిపుర ఉన్నాయి. ప్రస్తుత సంవత్సరంలో కేరళలో అత్యధికంగా (91.38 శాతం) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళల పనిదినాల వాటా ఉండగా తరువాత స్థానాల్లో పుదుచ్చేరి (87), తమిళనాడు (84.82), గోవా (75.75), రాజస్థాన్‌ (65.35), ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ (60.31) ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌ 30.72 ‌శాతంతో అతి తక్కువ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహిళా పనిదినాలు వాటా కలిగి ఉంది. యుపి (33), నాగాలాండ్‌ (36), అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ (40), ‌జార్ఖండ్‌ (40.77), ‌మధ్యప్రదేశ్‌ (41) ఉన్నాయి. కరోనా తర్వాత గ్రామీణ మహిళ నిరుద్యోగిగా మారుతున్నా పరిస్థితి కనిపిస్తున్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply