- కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న దళాలు
- ప్రతిఘటించకుండా చేతులెత్తేసిన ఆర్మీ
- దేశాధ్యక్షుడు అష్రాఫ్‌ఘనీ రాజీనామా
అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశంలోని దాదాపు ముఖ్యమైన అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు తాజాగా దేశ రాజధాని కాబూల్ లోకి ప్రవేశించారు. దీంతో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాలిబన్లకు అధికారం అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తాలిబన్ల నేతృత్వంలో అఫ్ఘానిస్తాన్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడనుందని, తాలిబన్ నాయకుడు ముల్లా బరాదర్.. ఖతార్ సహాయంతో అమెరికా ఆమోదంతో ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే అష్రఫ్ ఘనీ భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అఫ్రష్ ఘనీని బహిరంగంగా ఉరితీస్తామని గతంలో తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్రష్ ఘనీని తాలిబన్లు ఏం చేయనున్నారనేది కీలకంగా మారింది. మరోవైపు,దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలను కూడా అష్రఫ్ ఘనీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ వి•డియా తెలిపింది. నూతన తాత్కాలిక ప్రభుత్వానికి చీఫ్‌గా అలీ అహ్మద్ జలాలీని నియమించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పక్రియకు మధ్యవర్తిగా అత్యున్నత స్థాయి జాతీయ సయోధ్య మండలి చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో కాబూల్ ప్రజలకు హావి• ఇచ్చారు. సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని తెలిపారు. తాము శాంతి యుతంగానే కాబూల్ వైపు వొస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి నిరోధం లేకుండానే కాబూల్‌లోకి తాలిబన్లు వెళ్తున్నట్లు తెలుస్తుంది. తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో, కాబూల్ గేట్ల వద్దనే వేచి ఉండాలని చెప్పినట్లు తెలుస్తుంది.