Take a fresh look at your lifestyle.

అం‌దరి కోసం పాటుపడడం మతతత్వం కాదు

  • అభివృద్ధి, సుస్థిర శాంతి మా లక్ష్యం
  • గత ప్రభుత్వాలు అసోం గుర్తింపును ధ్వంసం చేశాయి
  • ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ

అసోంలో శాంతి, అభివృద్ధి సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ కూటమికి వోటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు అసోం గుర్తింపునే ధ్వంసం చేశాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ శనివారం అసోంలో పర్యటించారు. తమది ‘డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం’ అని మోదీ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రజల జీవితాలను, ముఖ్యంగా మహిళల జీవితాలు సౌకర్యవంతం కావడానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌ అన్న నినాదంతో ఐదేళ్లూ పనిచేశామని తెలిపారు. అసోం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హావి• ఇచ్చారు.

తాము అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నామని, వోటు బ్యాంకు రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. సమాజంలో ఓ వింత పోకడ నడుస్తుందని, కొన్ని విషయాలను వక్రీకరించి చూపిస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో వివక్ష ప్రదర్శించడం, సమాజాన్ని విడదీయడం, వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తే వారిని లౌకికవాదులు అని అంటున్నారని, అందరి కోసం పాటుపడితే వారిని మతతత్వ వాదులు అంటున్నారని మండిపడ్డారు. అటు లౌకికవాదం, ఇటు మతతత్వం రెండూ దేశానికి పెద్ద ప్రమాదమని మోదీ పేర్కొన్నారు. తమూల్‌ ‌పూర్‌ ‌నియోజకవర్గంలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సన్నివేశం చోటుచేసుకుంది. బహిరంగ సభలో పాల్గొన్న ఓ బీజేపీ కార్యకర్త హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

‘డీహైడ్రేషన్‌’ ‌తో బాధపడ్డారు. దీన్ని గమనించిన మోదీ…ఆయనకు వైద్యం చేయాలంటూ పీఎంవో వైద్య బృందాన్ని కోరారు. ‘నాతో పాటు వొచ్చిన వైద్యులారా దయచేసి ఆ కార్యకర్త వద్దకు వెళ్లండి. ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. దయచేసి పరీక్షించండి. వెంటనే సహాయం చేయండి’ అని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా, ఆయన వెంట నలుగురు వ్యక్తిగత వైద్య సిబ్బంది వెంట వెళ్తారు. వెంటనే వారు ఆ వ్యవక్తికి ప్రథమ చికిత్స అందించారు.

Leave a Reply