Take a fresh look at your lifestyle.

అమెరికాతో ఒప్పందంతో ప్రయోజనాలు, ఇబ్బందులు

“ఆర్థిక సంస్కరణలతో భారత్‌ అభివృద్ధి పథంలో  సాగుతోంది. 25 ఏళ్ల ప్రగతి కళ్ళముందుంది. భారత్‌ అమెరికా మధ్య తిరిగి  వ్యూహాత్మక బంధానికి ప్రయత్నాలు జరగడం సహజమే. ఇరుదేశాల మధ్య ఇంతవరకూ కుదిరిన ఒప్పందాల వల్ల ఎంతమేరకు మేలు జరిగిందని ప్రశ్నించుకుంటే లేదని చెప్పవచ్చు, ముఖ్యంగా అణు ఒప్పందంవల్ల   భారత్‌పై  వ్యతిరేక స్పందనలు వచ్చాయి తప్ప ఒక్క మెగావాట్‌ అణు విద్యుత్‌ ‌కూడా ఉత్పత్తి కాలేదు.  అందువల్ల పౌర అణు ఒప్పందం అణు ఒప్పందమా, లేక ద్వైపాక్షిక ఒప్పందమా అనేది ఇప్పటికీ సందిగ్ధమే.”

భారత్‌, అమెరికా లోగడ కుదుర్చుకున్న ఒప్పందం మనకు ఆరు పెద్ద ప్రయోజనాలను సమకూర్చి ఆనందింప జేసింది.అదే సందర్భంలో కొన్ని ఇబ్బందులను కూడా సృష్టించింది. భారత్‌, అమెరికా పౌర అణు ఒప్పందం లేదా ఇంధన ఒప్పందం ఎన్నో తీవ్రమైన చిక్కులను తెచ్చి పెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన మొదటి 53 సంవత్సరాల్లో ముగ్గురు అమెరికా అధ్యక్షులు ఐసెన హోవర్‌ (1959), ‌రిచర్డ్ ‌నిక్సన్‌ (1969),‌జిమ్మి కార్టర్‌ ( 1978) ‌మన దేశాన్ని సందర్శించారు. దేశానికి వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌వచ్చే నిప్పుడు మన దేశంలో పర్యటిస్తున్నారు. గడిచిన 20 ఏళ్ళలో మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుల్లో ఆయన ఐదవవారు. భారత్‌,అమెరికాలు ప్రజాస్వామిక వ్యవస్థలకు కట్టుబడిన పెద్ద దేశాలు, ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత పీవీ, మన్మోహన్‌ ‌సింగ్‌లు అమలు జేసిన ఆర్థిక సంస్కరణలతో భారత్‌ అభివృద్ధి పథంలో సాగుతోంది. 25 ఏళ్ల ప్రగతి కళ్ళముందుంది.

President's Trump

ఇరుదేశాల మధ్య తిరిగి వ్యూహాత్మక బంధానికి ప్రయత్నాలు జరగడం సహజమే.ఇరుదేశాల మధ్య ఇంతవరకూ కుదిరిన ఒప్పందాల వల్ల ఎంతమేరకు మేలు జరిగిందని ప్రశ్నించుకుంటే లేదని చెప్పవచ్చు,ముఖ్యంగా అణు ఒప్పందంవల్ల భారత్‌పై వ్యతిరేక స్పందనలు వచ్చాయి తప్ప ఒక్క మెగావాట్‌ అణు విద్యుత్‌ ‌కూడా ఉత్పత్తి కాలేదు. అందువల్ల పౌర అణు ఒప్పందం అణు ఒప్పందమా, లేక ద్వైపాక్షిక ఒప్పందమా అనేది ఇప్పటికీ సందిగ్ధమే. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వల్ల మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ ఎదుర్కొన్న విమర్శలు, ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి. అది సాకారం కాలేదు ఇప్పటికీ అంటే ఎంత చిక్కుముడులతో కూడిందో అర్ధం అవుతుంది.

మొదటిది అతి పెద్ద చిక్కులతో కూడినది సైద్దాంతికపరమైనది. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత భారత్‌ అమెరికాతో ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. ఇది ద్వైపాక్షికంగా కుదిరిన ఒప్పందమే, దశాబ్దాల అనుమానాల తర్వాత అమెరికన్లను నమ్మిస్తుందా ఈ ఒప్పందం పట్ల దేశంలో వామపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. యూపీఏ-1 మొదటి ప్రభుత్వం గడువు ఇంకా ఏడాది ఉండగానే వామపక్షాలు మద్దతు ఉపసం హరించుకున్నాయి. కాంగ్రెస్‌ ‌కట్టుబడే సైద్ధాంతిక జాతీయవాదానికి ఇది వ్యతిరేకం, ముస్లింలకు కాంగ్రెస్‌ ‌వ్యతిరేకం అయింది. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌తన హయాంలో ఇది ఒక ముఖ్య సంఘటనగా భావించి అమలుచేశారు. ఆనాటి యూపీఏ చైర్‌పర్సన్‌ ‌సోనియాగాంధీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో భారతీయ ఓటర్లు యూపీఏకి మరోసారి అధికారం ఇవ్వడంతో అంగీకరించి నట్టయి ంది. జాతీయ ప్రయోజనాల కోసమే యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుం దని స్పష్టమైంది. అలాగే,సాధారణంగా అమెరికా కు అనుకూల వైఖరిని తీసుకునే బీజేపీ దీనిని వ్యతిరేకించింది. వామపక్షాలు సహజంగానే అమెరికా వ్యతిరేక వైఖరితో దీనిని వ్యతిరేకిం చాయి. అయితే, 2009 ఎన్నికల్లో ఈ రెండూ కూడా ఓటమి పాలయ్యాయి. ఇది యూపీఏకి మొదటి విజయం. ఇక రెండవది వ్యూహాత్మక విజయం.

ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‌నాతో మాట్లాడుతూ… అణుపరంగా భారత్‌ ఏకాకి కావడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. దీనిని అంతమొందించే ందుకే అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. అయితే, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయకుండానే అణుఒప్పందం కుదిరింది. మూడోది ఏమిటంటే దేశానికి ప్రాధాన్యం పెరగడం. ఇప్పటివరకూ మన దేశంపై అంతర్జాతీయ రక్షణలు, పారదర్శక ప్రమాణాల గురించి ఎటువంటి ఒత్తిడి రాలేదు. మనది పౌరఅణు కార్యక్రమం,అణ్వస్త్ర కార్యక్రమం మిళితమైనది. అయినప్పటికీ ఎటువంటి ఒత్తిడులు రాలేదు. గతంలో అమెరికాతో ఒప్పందానికి మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కృషి చేశారు. సూపర్‌ ‌కంప్యూటర్‌ ‌విక్రయించేందుకు అమెరికా సిద్ధపడి వెనక్కి వెళ్ళింది.అమెరికాతో పౌరఒప్పందం కుదుర్చుకోవడం వల్ల రక్షణరంగంలో కూడా ప్రయోజనాలు ఒనగూరాయి. వ్యూహాత్మక రక్షణ,శాస్త్రీయ రంగాల్లో ప్రయోజనాలు పొందేందుకు వీలు కలిగింది.ప్రాంతీయ రాజకీయాల్లో కూడా ప్రయోజనం కలిగింది.15 ఏళ్ళు పైగా అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ను ప్రోత్సహిస్తూ వచ్చింది.తర్వాత వైఖరి మార్చుకుంది. అప్పట్లో లోక్‌సభలో 60ప్లస్‌ ‌సీట్లు గెల్చుకున్న వామపక్షాలు తర్వాత ఆ సీట్లను నిలబెట్టుకోలేకపోయాయి. ఇప్పుడు రెండంకెల కోసం సతమతమవుతున్నాయి. అణు ఒప్పందంపై సైద్ధాంతిక పోరాటం ఫలించలేదు. అయినా అణు ఒప్పందం కుదుర్చుకున్న మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వాన్ని దింపేయడానికి బీజేపీతో ఉమ్మడి పోరాటం జరిపింది.. దాంతో సింగ్‌‌ప్రభుత్వం దిగి పోయింది. వామపక్షాల సైద్ధాంతికత అంటే అమెరికా పట్ల వ్యతిరేకత ఓడిపోయింది. హిందుత్వ వాదులతో చేతులు కలిపింది. ఆ వెంటనే పశ్చిమ బెంగాల్లో ఓటమి పాలైంది. అధికారానికి పూర్తిగా దూరం అయింది.
– శేఖర్‌గుప్తా

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!