Take a fresh look at your lifestyle.

బాబ్రీ మసీదు కూల్చివేతలో.. ఎలాంటి కుట్ర లేదు..

అద్వానీ, జోషి, ఉమాభారతి సహా అంతా నిర్దోషులే .. 
సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు  

‌బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూల్చివేతలో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చి చెప్పింది. అలాగే ఇది ముందస్తు ప్రణాళిక మేరకు కూల్చి వేశారనడానికి ఆధారాలు లేవని తేల్చింది. ఇదంతా ఆవేశపూరతితంగా అప్పటికప్పుడు జిరగిన వ్యవహారంగా సిపబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి అభిప్రాయపడ్డారు. మసీదు కూల్చివేత కుట్రకాదని … కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్‌ ‌పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్‌ ‌చదివి వినిపిస్తున్నారు.

దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్‌కె అద్వాణీ, మురళీ మనోహర్‌ ‌జోషి, ఉమా భారతీ తదితరులను నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు బుధవారం  వెలువడింది. అభియోగాలు ఎదుర్కొం టున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆరుగురు హాజరయ్యారు.   బాబ్రీ మసీదు కూల్చివేత ముందుగా అనుకున్న పథకం ప్రకారం చేసింది కాదు అని కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మంది నిర్దోషులే అంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియా ఆధారాల మూలంగా నిందితులను దోషులగా తేల్చలేమని కోర్టు చెప్పింది. నిందితులపై ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply