Take a fresh look at your lifestyle.

పేద ప్రజల కోసం.. అధునాతన డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్‌

డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లకు…ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి… మంత్రి హరీష్‌రావు

పేదల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల్లో  2 కోట్ల 50 లక్షల రూపాయలతో 57 పరీక్షలు చేసే సౌకర్యం కల అధునాతన డయాగ్నోస్టిక్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామనీ, నెల రోజుల్లో  2 కోట్ల 52 లక్షల రూపాయలతో సిటీ స్కాన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 20 బెడ్‌ల సామర్థ్యం గల ఐసియూను 40 పడకలకు త్వరలో పెంచుతామన్నారు. డయాలసిస్‌ ‌సెంటర్‌లోనూ  పడకల సంఖ్య పెంచుతామనీ, గుండె పరీక్షలు చేసే అల్ట్రా సౌండ్‌ ‌మిషన్‌, 2‌డి ఎకో సెంటర్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

గూడు లేని నిరుపేదల కోసం డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు నిర్మించే అవకాశం రావడం…భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావించానని మంత్రి తెలిపారు. కేసిఆర్‌నగర్‌లో 2,460 ఇండ్ల గృహ సముదాయం నిర్మాణంను అన్నీ వసతులతో పూర్తి చేసేందుకు తాను స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో రెండేండ్లలో 400పర్యాయాలకు పైగా పర్యటించామన్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది అనాదిగా వస్తున్న నానుడి అని మంత్రి తెలిపారు. జీవితంలో ప్రధానమైన ఈ రెండు అంశాలను పూర్తి చేసేందుకు చాలా కష్టంతో కూడుకున్నదని దీని అర్థం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ఇల్లు, పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్త్తుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా, చెమట చుక్క చిందించ కుండా గూడు లేని నిరుపేదలు కు ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. కేసిఆర్‌ ‌నగర్‌లో పెద్దల గేటెడ్‌ ‌కమ్యూనిటీ ఇండ్ల మాదిరి అన్ని సౌకర్యాలు తో కూడిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లను గూడు లేని అసలైన గరీబోల్లకే కేటాయించామన్నారు.

నిరుపేదల స్వంతింటి కలను నిజం కాబోతున్న అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో… కేసీఆర్‌ ‌నగర్‌లో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్‌ ఇం‌డ్ల సముదాయాలకు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు రెండేండ్లకు పైగా సమయం పట్టిందని మంత్రి తెలిపారు.మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామని మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి జల్లెడ పట్టి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికం గా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని బాజప్తా వార్డు గోడల పై లబ్దిదారుల జాబితా ప్రదర్శించసమన్నారు. కేటాయింపు రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు స్థానిక కౌన్సిలర్లు సహకరించారన్నారు.
ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి…
నయా పైసా ఖర్చు లేకుండా ఒక్క పైసా లంచం లేకుండా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు. ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్లు చెబితే వారికి రూ.10 వేల బహుమానం ఇస్తానని మంత్రి తెలిపారు.

ప్రతిగా లబ్దిదారులు స్పందిస్తూ తమను ఎవ్వరూ ఒక్క పైసా లంచం అడగలేదని..ఇవ్వలేదని తెలిపారు.ప్రతీ ఇంట్లో గృహ విద్యుత్‌, ‌నల్లా, గ్యాస్‌ ‌కనెక్షన్‌, ‌పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారులకు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నామన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్‌ ‌డేటాతో సరిపోల్చుతూ… అర్హులకే మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నామన్నారు. మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే…. పట్టా ఉత్తర్వుతో పాటు.. నల్లా కనెక్షన్‌ ‌మంజూరు పత్రం, కరెంట్‌ ‌కనెక్షన్‌ , ఇం‌టి నెంబర్‌, ‌పైపుడ్‌ ‌గ్యాస్‌ ‌కనెక్షన్లు అందజేస్తున్నామన్నారు.

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో కేసిఆర్‌ ‌నగర్‌ను అనుసంధానం చేశామన్నారు. ఫలితంగా ఉపరితల మురుగు కాల్వలు ఉండవన్నారు. దోమలు, పందుల బెడద తప్పి.. అనారోగ్యం దరి చేరదన్నారు.అంతే కాకుండా స్వంత అన్నయ్య లా ఆశీర్వదిస్తూ…నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యత  లబ్ధిదారుల దేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా నేరమని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకు కేసీఆర్‌ ‌నగర్‌కు ప్రతి రోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. బస్సు సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ. 25 లక్షలతో పోలీస్‌ ‌పోస్ట్ ‌కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కేసీఆర్‌ ‌నగర్‌ ‌కు బస్తీ దవాఖానా వచ్చే వరకు ఒక ఏఎన్‌ఎం, ఆశ వర్కర్‌తో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు త్వరలోనే కేసిఆర్‌ ‌నగర్‌కు బడి, రేషన్‌ ‌షాప్‌, ‌గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లబ్దిదారులు గృహ సముదాయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ మేరకు మంత్రి డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల లబ్ధిదారుల కుటుంబం సభ్యులకు మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు ఇండ్ల పట్టాలు, నూతన వస్త్రాల బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply