Take a fresh look at your lifestyle.

గుజరాత్‌లో విషాదం నింపిన  కల్తీ మద్యం

28 మంది మృత్యువాత
గాంధీనగర్‌, ‌జూలై 26 : గుజరాత్‌లో కల్తీ మద్యం తీవ్ర విషాదంనింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు గుజరాత్‌ ‌డీజీపీ ఆశిష్‌ ‌భాటియా తెలిపారు. బొటాడ్‌ ‌జిల్లా, రోజిడ్‌ ‌గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్‌ ‌సహా చట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు ఆదివారం రాత్రి అనారోగ్యంతో.. ప్రభుత్వ హాస్పిటల్స్ ‌లో చేరారు. సోమవారం ఉదయమే ఇద్దరు చనిపోగా.. మరికొందరు ట్రీట్మెంట్‌ ‌తీసుకుంటూ చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీకూలీలు ఉన్నారని అధికారులు అన్నారు. ధందుక, భావ్‌ ‌నగర్‌, ‌బోటాడ్‌ ‌జిల్లాల్లోని హాస్పిటల్స్ ‌లో కల్తీ మద్యం తాగి అడ్మిట్‌ అవుతున్న వారి సంఖ్య పెరుగు తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం భావ్‌ ‌నగర్‌ ‌నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని రోజిడ్‌ ‌గ్రామానికి పంపించింది. దీనిపై విచారణ కోసం సిట్‌ ‌ను ఏర్పాటు చేసింది గుజరాత్‌ ‌ప్రభుత్వం. హాస్పిటల్‌ ‌లో ట్రీట్మెంట్‌ ‌పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వాటర్‌ ‌తో కలిపిన కెమికల్‌ ‌ను 600 మందికి విక్రయించి 40 వేలు వసూలు చేశారని గుజరాత్‌ ‌డీజీపీయతెలిపారు.

Leave a Reply