Take a fresh look at your lifestyle.

కొరోనా టెస్ట్ ‌రిపోర్ట్ ఉం‌టేనే మెదక్‌ ‌కలెక్టరేట్‌లోకి అనుమతి

  • కలెక్టర్‌ ఆదేశాలతో సిబ్బంది ఆంక్షలు
  • కార్యాలయం ఆవరణలోనే పరీక్షా కేంద్రం

జిల్లా కలెక్టరేట్‌లో పనుల కోసం వొచ్చే వారికి కొరోనా టెస్టులను తప్పనిసరి చేశారు. టెస్ట్ ‌చేయించుకుని నెగెటివ్‌ ‌వొచ్చిన వారినే సిబ్బంది లోనికి అనుమతిస్తున్నారు. కలెక్టర్‌ను కలవాలంటే కొరోనా టెస్ట్ ‌కంపల్సరీ అంటూ విజిటర్స్‌ను అడ్డుకుంటున్నారు. అంతేకాదు కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా కొరోనా పరీక్షల కేంద్రం ఏర్పాటుచేసి టెస్టులు చేయిస్తున్నారు. కొరోనా నెగిటివ్‌ ‌వస్తేనే సిబ్బంది కార్యాలయం లోపలికి అనుమతిస్తున్నారు. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తుండగా కలెక్టర్‌ ఆదేశాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కొరోనా వైరస్‌ ‌క్రమంగా కొరోనా బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. వైరస్‌ ‌కట్టడికి చర్యలు తీసుకుంటూనే  పజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply