Take a fresh look at your lifestyle.

రాజు పరిపాలనా దక్షత

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

నమ్మదగిన వాడూ, నిర్మలమైన  మనస్సుకలవాడు, ఉత్తమ వంశంలో పుట్టినవాడూ, నిర్వహణాదక్షుడూ, కుశాగ్రబుద్ది అయినవారినే మంత్రిగా నియమించాలి. విషమ సమస్యలను  ప్రధానులతో చర్చించాలి. అంతేగాని అందరినీ సంప్రదించరాదు. కోశాగారంలో ఎప్పుడూ ధనం సమృద్ధిగా ఉండాలి. రైతులకు సేద్యం చేయడానికి వీలుగా తగిన సమయంలో సామాగ్రని సరఫరా చేయాలి.  సేద్యం చేసేవారిని ఆ పనికే ఉపయోగించుకోవాలి. విద్యా భోదన చేసే శాస్త్రజ్ఞులు ధర్మదృష్టి కలిగివుండాలి. వివేకం కలిగిన వారిలో ఒక్కరిని కూడా దూరం చేసేకోరాదు. ముర్ఖులను ఆదరించి చేరదీయరాదు.

మంచినీటికి ఇబ్బంది తరగకుండా చూడాలి. వివిధ శాఖలకు చెందిన ముఖ్యులను  ఒక కంటకనిపెడుతూ ఉండాలి. అందరివ్యవహారాలు ఎప్పటికప్పుడు తెల్సుకుంటూ ఉండగలగాలి. పదవులిచ్చేటప్పుడు వారి వారి స్వభావాలను పరిశీలించి ఉత్తములు, మధ్యమ, అధములుగా వర్గీకరించి ఇవ్వాలి. శిష్టాచారపరులూ మర్యాద తెల్సినవారూ, వంశపారం పర్యంగా సేవలందిస్తున్న వారినే మంత్రులుగా నియమించాలి. దండనీతిని అమలు జరపేటప్పుడు సమయ సందర్భాలు తెల్సుకుని చేయాలి. అవసరం అనుకుంటే వెనుకాడ కుండా అమలు చేయల్సివుంది. పవిత్రమైన యాజకుడు అనాచారిగా వుండే యజమానిని విడిచిపెడతాడు. కామలాలసుడైన వానిని శీలవతి అయిన స్త్రీ విడిచిపెడుతుంది. ప్రభువు తక కర్తవ్యాన్ని ప్రజలపై వుంచితే ఆయనను పద భ్రష్టుని చేస్తారు. సేవకులైనవారు సాహస పరాక్రమాలను ప్రదర్శిస్తే వారిని  సన్మానించాలి. వారిని ఉన్నత పదవులకు ఎంపిక చేయాలి. సైన్యానికి అవసరమైన వస్తువులు అందేలా చూడాలి. దేశం కోసం త్యాగం చేసినవారి కుటుంబాలను ఆదుకోవాలి.

విద్య, వివేకమూ, కార్యకార్య పరిజ్ఞానమూ కలిగిన మేధావులను పోషించాలి. నీ మంత్రాంగంలో అంగరక్షకులూ వారిని  ప్రోత్సాహించేవారూ వుండవచ్చును. మన కార్యాలు చర్కపెట్టుకోవడానికి శత్రుపక్షంలో లోభులనూ, అవమానింప బడిన వారినీ, జీతాలు సరిగారానివారినీ వాడుకోచ్చును. దైవపరమైన ప్రమాదాలు కొన్ని అయితే, మరికొన్ని మరో విధంగా సంభవిస్తాయి. ప్రభువులోభ బుద్ధితో ప్రజలను పీడించరాదు. రాజ్యంలో మూరు?లు నాయకులు కావడం ద్వారా స్వార్థమూ, లోభమూ పెరిగిపోతాయి.

(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply