Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలింది టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

‌రాష్ట్రంలో పరిపాలన కుప్పకూలిందని, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. ఎక్కడా వ్యవస్థలు నడవడం లేదన్నారు.  సీఎం ఉన్నారో?. లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఆయన జనగాం జిల్లాలో వాకర్స్‌తో మాట్లాడుతూ రాష్ట్రంలో బతుకు దెరువు సమస్య కీలకమని చెప్పారు. టీచర్లు, వాలంటీర్లు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు బతుకుదెరువు కోసం పోరాడుతున్నారని చెప్పారు.

బతుకుదెరువు నిలబెట్టు?. తెలంగాణను కాపాడు నినాదంతో ప్రచారం చేయనున్నట్లు కోదండరామ్‌ ‌తెలిపారు. అన్ని జిల్లాల్లో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాలు నిర్వహిస్తామని, తర్వాత ప్రచార యాత్రను చేస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ ఆయన ప్రచారం చేపట్టారు. ఈ మేరకు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

Leave a Reply