Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ఉభయసభలు నేటికి వాయిదా

పార్లమెంట్‌ ఉబయసభల్లో బుధవారం కూడా గందరగోళం చెలరేగింది. దీంతో ఉబయ సభలు మరునాటికి వాయిదా పడ్డాయి. ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సభలో చర్చించాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి డిమాండ్‌ ‌చేశారు. కాగా.. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారని దీనిపై పార్లమెంటులో వెంటనే చర్చించాలన్నారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా మాట్లాడుతూ.. •లీ పండగ తరువాత సభలో చర్చ జరుగుతుందని అన్నారు. కాగా అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. అంతేకాకుండా చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతోందని, అంతలా ఎందుకు భయపడుతున్నారని అన్నారు.

కాగాలీ గురించి రా మాట్లాడేది.. ఢిల్లీలో రక్తంతో •లీ ఆడుతున్నారని అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి ఘాటైన విమర్శలు చేశారు. కాగా మంగళవారం సాయంత్రం అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి కార్యాలయంపై దాడి జరిగింది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఢిల్లీలోని ఆయన ఇంటి పక్కనే ఉన్న కార్యాలయంలోకి చేరుకొని అక్కడి సిబ్బందిని దూషించారు. అనంతరం తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎంపీ చౌదరితో ఫోన్‌లో మాట్లాడాలని, అయన కాంటాక్ట్ ‌వివరాలు ఇవ్వాలంటూ ఆఫీసు సిబ్బందిని అడిగారు. దీనికి వారు నిరాకరించడంతో కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి ప్రైవేట్‌ ‌కార్యదర్శి ప్రదీప్టో రాజ్‌పండిట్‌ ‌ఫిర్యాదు చేయగా, దుండగులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

రాజ్యసభలో మళ్లీ గందరగోళం సభ నేటికి వాయిదా:
రాజ్యసభలో మళ్లీ గందరగోళం చెలరేగడంతో గురువారానికి వాయిదా పడింది. ఢిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు సంతాప తీర్మానం సభ ముందు ఉంచారు. ఫిబ్రవరి 26న మృతి చెందిన రాజ్యసభ ఎంపీ, అస్సాం గణపరిషత్‌ ‌నేత బద్రేశ్వర్‌ ‌మృతికి సానుభూతి తెలుపుతూ.. రాజ్యసభ 2 నిమిషాలు మౌనం పాటించింది. అధికార భాషపై కమిటీ ఎన్నికకు సంబంధించి కేంద్ర •ంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ ‌ప్రకటన చేశారు. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ ‌లో పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ సూచనలతో తీసుకుంటున్న చర్యలపై •ంశాఖ సహాయమంత్రి కిషన్‌ ‌రెడ్డి స్టేట్‌ ‌మెంట్‌ ఇచ్చారు. ఆ తర్వాత విపక్షాలు నినాదాలు మొదలుపెట్టాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులపై సభా నాయకులు , ప్రతిపక్షాలపై చర్చించాల్సి ఉందని.. మార్చి 11 తర్వాత చర్చిద్దామని వెంకయ్యనాయుడు చెప్పారు. రూల్స్, ‌ప్రొసీజర్లను పరిశీలించి చర్చించాల్సి ఉందని చైర్మన్‌ ‌చెప్పారు. కరోనా వైరస్‌ ‌పై చర్చించాల్సి ఉందని చెప్పినా.. విపక్ష సభ్యులు వినలేదు. గందరగోళం మధ్య రాజ్యసభను గురువారం 11 గంటలకు వాయిదా వేశారు వెంకయ్యనాయుడు.

Leave a Reply