Take a fresh look at your lifestyle.

చాలినంత ఆక్సీజన్‌ ‌సరఫరా..!

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం ముఖ్యం
  • ట్యాంకర్లు దేశమంతా స్వేచ్ఛగా తిరిగేందుకు చర్యలు
  • ఆక్సిజన్‌ ‌లభ్యతపై ప్రధాన మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష
  • సామర్థ్యం మేరకు ఉత్పత్తి పెంచాలని ఆక్సిజన్‌ ‌ప్లాంట్లకు ప్రధాని సూచన

దేశంలో వైద్యానికి ఉపయోగించే ప్రాణ వాయువు సరఫరా చాలినంతగా ఉండేటట్టు చూడటం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక సమగ్ర సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంలో ఆరోగ్య శాఖ, వాణిజ్యం- పరిశ్రమ శాఖకు చెందిన  కేంద్ర ప్రభుత్వ విభాగం డిపార్ట్‌మెంట్‌ ‌ఫర్‌ ‌ప్రమోశన్‌ ఆఫ్‌ ఇం‌డస్ట్రి అండ్‌ ఇం‌టర్‌ ‌నల్‌ ‌ట్రేడ్‌(‌డిపిఐఐటి), ఉక్కు, రహదారి రవాణా వగైరా మంత్రిత్వ శాఖలు వాటి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువొచ్చారు.  వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయంతో కలసి పనిచేయడం ముఖ్యమని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ ‌సరఫరాపై ప్రస్తుత స్థితిని గురించి, అధిక భారం ఉన్న 12 రాష్ట్రాలు (మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ‌గుజరాత్‌, ఉత్తర్‌ ‌ప్రదేశ్‌, ‌దిల్లీ, ఛత్తీస్‌ ‌గఢ్‌, ‌కర్నాటక, కేరళ, తమిళ నాడు, పంజాబ్‌, ‌హరియాణా, రాజస్థాన్‌) ‌లో రానున్న 15 రోజులలో దీని ఉపయోగం ఎంత ఉండగలదన్న అంశం గురించి కూడా ప్రధాన మంత్రి సమగ్ర సమీక్ష జరిపారు. ఈ రాష్ట్రాలలో జిల్లాల స్థాయిలో గల స్థితిగతుల•పై పరిశీలనను అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువొచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుకుంటున్నాయని, ఏప్రిల్‌ 20‌వ, ఏప్రిల్‌ 25‌వ, ఏప్రిల్‌ 30‌వ తేదీల నాటికి అవసరం ఎంత ఉండవొచ్చన్న అంచనాల తాలూకు సమాచారాన్ని రాష్ట్రాలకు తెలియజేయడమైందని వారు ప్రధాన మంత్రికి వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఈ రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి గాను ఏప్రిల్‌ 20‌వ తేదీ వరకు 4,880 ఎమ్‌టి, ఏప్రిల్‌ 25‌వ తేదీ వరకు 5,619 ఎమ్‌టి, ఏప్రిల్‌ 30‌వ తేదీ వరకు 6,593 ఎమ్‌టి కేటాయించడం జరిగింది. పెరుగుతున్న గిరాకీని తట్టుకోవడం కోసం దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని గురించి ప్రధాన మంత్రికి వివరించారు. ప్రతి ఒక్క ప్లాంటు సామర్థ్యం మేరకు ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచవలసిందిగా ప్రధాన మంత్రి సూచన చేశారు.  ఉక్కు ప్లాంట్లలో మిగులుగా ఉన్న ఆక్సిజన్‌ ‌సప్లయ్‌ ‌నిల్వలను వైద్యపరమైన ఉపయోగం కోసం ఇవ్వజూపడం జరుగుతున్నదన్న అంశంపై కూడా చర్చించారు. ఆక్సిజన్‌ను చేరవేసే ట్యాంకర్‌లు దేశమంతటా సాఫీగా, స్వేచ్ఛాయుతంగా తిరిగేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందంటూ అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌లు అన్ని రాష్ట్రాల నడుమ రాకపోకలను సులభంగా జరిపేందుకు వీలుగా వాటికి పర్మిట్‌ల రిజిస్ట్రేషన్‌ ‌పక్రియ నుంచి ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది.

డ్రైవర్‌లు షిఫ్టుల పద్ధతిలో పనిచేస్తూ ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌లు రోజులో ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటూ వేగంగా రాకపోకలను జరిపేటట్టు చూడవలసిందిగా, అలాగే పెరుగుతున్న డిమాండును తీర్చడం కోసం చాలినంత సామర్థ్యాన్ని అందుబాటులో ఉంచవలసిందిగాను రాష్ట్రాలకు, రవాణా సంస్థలకు సూచనలు చేసినట్లు అధికారులు ప్రధాన మంత్రికి వివరించారు. ఆ ప్రకారం సిలిండర్‌లను నింపే ప్లాంటులు కూడా అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలను తీసుకుంటూ 24 గంటల పాటు పనిచేయడానికి గాను ఆ ప్లాంట్లకు అనుమతిని ఇవ్వడం జరుగుతుంది.  పారిశ్రామిక సిలిండర్‌లను అవసరమైనంత మేరకు శుద్ధి చేసిన అనంతరం మెడికల్‌ ఆక్సిజన్‌కై ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం సంబంధిత అనుమతిని ఇస్తుంది. అదే మాదిరిగా, ట్యాంకర్‌ల పరంగా ఒకవేళ కొరత ఏర్పడే పక్షంలో, ఆ లోటును అధిగమించడం కోసం నైట్రోజన్‌ ‌ట్యాంకర్‌లను, ఆర్గాన్‌ ‌ట్యాంకర్‌లను సైతం ఆటోమేటిక్‌ ‌ప్రాతిపదికన ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌లుగా మలచడానికి వాటిలో తగిన మార్పులను చేసేందుకు అనుమతులను ఇవ్వడం జరుగుతుంది. అధికారులు మెడికల్‌ ‌గ్రేడ్‌ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువొచ్చారు

Leave a Reply