Take a fresh look at your lifestyle.

కూడికలు-తీసివేతలు

“ఇక కమలంతో దోస్తీ లాభ నష్టాల బేరీజు వేసేటప్పుడు ముందుగా రాష్ట్ర ఆర్ధిక పరస్థితి కోణం కీలకమైంది. కేంద్రంలో రెండో లేదో మూడో మంత్రి పదవులు దక్కితే ఆర్ధికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నది ఒక వాదన. పైగా ఉద్యోగుల జీతాలు ఇవ్వటానికి కూడా వెతుక్కోవల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్ధిక చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ఈ కోణంలో కేంద్రంతో బలమైన బంధం వైసీపీ ప్రభుత్వానికి ఉంటే రాష్ట్ర గల్లా పెట్టే కాస్త తేరుకునే అవకాశాలను కొట్టి పారేయలేం. రాజకీయ ధృక్కోణంలో చూసినప్పుడు కూడా టీడీపీని ఒంటరిని చేసే అవకాశం ఉంటుంది. జనసేన, బీజేపీ ఇప్పటికే ఒక బంధంలో ఉన్నాయి. చంద్రబాబు కొన్ని వ్యవస్థలను మేనేజ్‌ ‌చేస్తున్నారని తరచూ ఆరోపించే వైసీపీ ఇటువంటి సమస్యలను మరింత ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.”

pendrive rehana senior journalistగత రెండు, మూడు రోజుల నుంచి ఆంధప్రదేశ్‌ ‌రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం, చర్చ జరుగుతున్న అంశం వైఎస్‌ఆర్సీపీ ఎన్డీయేలో భాగస్వామ్యం కానుందా? ఎన్ని మంత్రి పదవులు ఆఫర్‌ ‌చేశారు? వీళ్లు ఎన్ని కావాలని అడుగుతున్నారు? చర్చ మరింత కాస్త ముందుకు వెళ్లి మంత్రి పదవి రేసులో ఉన్న నేతలు, సామాజిక సమీకరణాల ప్రకారం ఎవరికి కేంద్ర మంత్రి పదవి వరించనుంది అన్న చర్చ కూడా జోరుగానే సాగుతోంది. బీజేపీతో అధికారం పంచుకోవటానికి, పంచుకోకుండా ఉండటానికి వైసీపీ ముందు ఉన్న అవకాశాలు, ప్రత్యామ్నాయాలు, అవసరాలు ఏంటి అనే లోతైన విశ్లేషణ జరగాల్సిన సందర్భం.

ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన రెడ్డి ప్రధాని నరేంద్రమోడితో రెండు రోజుల కిందట అంటే ఈ నెల ఆరో తేదీన భేటీ అయ్యారు. అంతకు రెండు వారాల లోపే హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాతోనూ సమావేశమయ్యారు. అందులోనూ వరుసగా రెండు రోజుల పాటు వీరి భేటీ జరిగింది. మళ్లీ ఇప్పుడు ప్రధానితో హఠాత్తుగా సమావేశం కావటంతో సహజంగానే రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన రెగ్యులర్‌ అం‌శాలు నిధులు, ప్రాజెక్టులు, విభజన చట్టంలోని హామీలు వంటివి ఎలాగూ ఉంటాయి. వీటిని దాటి ప్రధానికి, ముఖ్యమంత్రికి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుందన్నది రాజకీయ వర్గాలకు, మీడియాకు ఆసక్తికర ముడిసరుకు.

janasena, bjp and telugu desam party

కమలంతో చేతులు కలిపితే లాభమా? నష్టమా?

ఆంధప్రదేశ్‌ ‌లో వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీతో మంచి సంబంధాలనే నెరుపుతోంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ఇప్పటి వరకు సాఫీగానే సాగుతున్నాయి. రాజకీయంగా కూడా బీజేపీ కేంద్ర అధిష్టానం వైసీపీ పై విమర్శలు గుప్పించిన సందర్భాలు తక్కువ. అదే విధంగా వైసీపీ అధినాయకత్వం కూడా ఎప్పుడూ కేంద్ర బీజేపీ నాయకత్వం పై డైరెక్ట్ అటాక్‌ ‌చేసింది లేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం కాస్త ఒక్కోసారి అగ్రసివ్‌ ‌లైన్‌ ‌లో వెళుతున్నా…ఢిల్లీ పెద్దలతో డైరెక్ట్ ‌సంబంధాల వల్ల స్థానిక రాజకీయ ఆరోపణలు, మాటల దాడులు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు విస్తృత ఫ్రేమ్‌ ‌లో చూసినప్పుడు.

ఇక కమలంతో దోస్తీ లాభ నష్టాల బేరీజు వేసేటప్పుడు ముందుగా రాష్ట్ర ఆర్ధిక పరస్థితి కోణం కీలకమైంది. కేంద్రంలో రెండో లేదో మూడో మంత్రి పదవులు దక్కితే ఆర్ధికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నది ఒక వాదన. పైగా ఉద్యోగుల జీతాలు ఇవ్వటానికి కూడా వెతుక్కోవల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్ధిక చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ఈ కోణంలో కేంద్రంతో బలమైన బంధం వైసీపీ ప్రభుత్వానికి ఉంటే రాష్ట్ర గల్లా పెట్టే కాస్త తేరుకునే అవకాశాలను కొట్టి పారేయలేం. రాజకీయ ధృక్కోణంలో చూసినప్పుడు కూడా టీడీపీని ఒంటరిని చేసే అవకాశం ఉంటుంది. జనసేన, బీజేపీ ఇప్పటికే ఒక బంధంలో ఉన్నాయి. చంద్రబాబు కొన్ని వ్యవస్థలను మేనేజ్‌ ‌చేస్తున్నారని తరచూ ఆరోపించే వైసీపీ ఇటువంటి సమస్యలను మరింత ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

నాణాన్ని మరోవైపు తిప్పితే ఎన్డీయేలో చేరటం వల్ల రాష్ట్రానికి విస్తృత ప్రాతిపదికన ప్రయోజనం జరుగుతుందనే వాదనలోనూ బలం లేదనే చెప్పాలి. విభజన వల్ల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని చెబుతున్న నేపథ్యంలో ఆర్ధిక వెసులుబాటు పూర్తి స్థాయిలో లాభం జరుగదు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీ ఓటు బ్యాంకు పునాది, బీజేపీ సైద్ధాంతిక క్షేత్రం పరస్పరం విరుద్ధమైనవి. ఈ రెండు పక్షాలు చేతులు కలపటం వల్ల వారి వారి ఓట్‌ ‌బ్యాంక్‌ ‌తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా వైసీపీ అధినేత జగన్‌ ‌కి కూడా ఎన్డీయేలో చేరటం పెద్ద సవాలు అవుతుంది. ఎన్నికలకు ముందు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25 మంది ఎమ్పీలను ఇవ్వండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తానని పదే పదే చెప్పారు. అంత కాకపోయినా 22 మంది ఎమ్‌.‌పీల భారీ సంఖ్యను పార్టీకి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టారు. దీనితో లోక్‌ ‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయినా ప్రత్యేక హోదా గురించి కేంద్రం ముందు గట్టిగా గళం వినిపించే పరిస్థితి ఇవాళ వైసీపీకి లేదు. హోదా ఇస్తే ఎవరితో అయినా చేతులు కలుపుతానని చెప్పిన జగన్‌ ఇవాళ ఎన్డీయేలో చేరాలనుంటే…చేరికకు ప్రాతిపదిక ఏమిటో ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే కండీషన్‌ ఏమీ లేకుండానే అధికారంలో భాగస్వామ్యం అయితే ఒక నాయకుడిగా జగన్‌ ‌విశ్వసనీయత ప్రశ్నార్ధకం అవుతుంది.

రాజకీయంగా కీలకమైన అడుగు వేసేటప్పుడు ఏ పార్టీ అయినా లాభనష్టాల లెక్కలు వేసుకోకుండా ఉండదు. ఇప్పుడు బీజేపీకి కాని, వైసీపీకి కాని ఉన్నపళంగా అధికారికంగా చేతులు కలపాల్సిన అవసరమూ లేదు. అందుకే గుమ్మం బయట ఉండే నమ్మకస్తుడైన స్నేహితుడి పాత్రను వైసీపీ పోషిస్తుందని అర్థం అవుతోంది పార్టీ నేతల వ్యూహాలను గమనిస్తే.

Leave a Reply