Take a fresh look at your lifestyle.

ఖమ్మంలో వలస కార్మికుల ఆందోళన

  • కూలీలతో చర్చించిన అడీషనల్‌ ‌డీసీపీ మురళీధర్‌ 

ఖమ్మం,మే 5 ప్రజాతంత్ర (ప్రతినిధి): తినడానికి తిండిలేదు..జేబులో రూపాయి బిళ్ళలేదు..యాజమానులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని మంగళవారం ఖమ్మం టూటౌన్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ఎదుట వందలాది మంది గ్రానైట్‌ ‌వలస కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రానైట్‌ ‌యాజమాన్యాలు తమను పట్టించుకోలేదని తినడానికి తిండి కూడా పెట్టడం లేదని, కనీస జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పోరుగు రాష్ట్రాలలో ఉన్న మా కుటుంబాలు పస్తులుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని , న్యాయం చేయాలని,ఆకలితో ఉన్న తమను ఆదుకోవాలని పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.దీంతో టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకారులతో నిండిపోయింది. తాము ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారం చూపడంతో పాటు సొంత రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకొవాలనికార్మికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అడీషనల్‌ ‌డీసీపీ మురళీధర్‌రావు వలస కార్మికులతో చర్చించారు. స్వస్థలాలకు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో వలస కార్మికుల తరలింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది కార్మికులు వచ్చారో వారి వివరాలు సేకరించిన ,రెవిన్యూ ,పోలీస్‌ అధికారులు త్వరలోనే సొంత రాష్ట్రాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అప్పటివరకు ఏలాంటి ఆందోళన చేంద కుండా మీ ప్రాంతాలలో ప్రశాంతంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో వలస కార్మికులకు అవసరమైన సహకారం అందించాల్సిన భాద్యత యాజమాన్యాని దేనని గుర్తు చేశారు. గ్రానైట్‌ ‌యాజమాన్యం తో మాట్లాడి సమస్యలు త్వరలోనే పరిష్కారిస్తామని హమీ ఇచ్చారు. సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు అసక్తిగా ఉన్న వారిని కొద్ది రోజుల్లోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైలు మార్గంలో సొంత రాష్ట్రాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వలస కార్మికులు ఆందోళన విరమించారు. అనంతరం పలువురు దాతల సహకారంతో ఐదు వందలమంది వలస గ్రానైట్‌ ‌కార్మికులకు బోజన ప్యాకెట్లు, మంచినీరు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఆర్డీవో రవీంద్రనాథ్‌ , ఏసీపీలు వెంకటరెడ్డి ,రామోజీ రమేష్‌, ఆర్బన్‌ ‌తాసిల్దార్‌ ‌శ్రీనివాస్‌ ‌రావు, సిఐ తుమ్మ గోపి తదితరులు ఉన్నారు.

Leave a Reply