Take a fresh look at your lifestyle.

కొనుగోళ్లపై అదనపు కలెక్టర్‌ ‌సమీక్ష

మెదక్‌, ఏ‌ప్రిల్‌ 21( ‌ప్రజాతంత్ర ప్రతినిధి) : అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌మెదక్‌ ‌గారు ధాన్యం కొనుగోలు, నాణ్యత పరిశీలన,  రైస్‌ ‌మిల్లులలో ధాన్యం దిగుమతిపై సమీక్ష నిర్వహించారు. దీనిలో ముఖ్యంగా అకాల వర్షాల వల్ల రైతుల ధాన్యంకు నష్టం జరగకుండా కొనుగోలు వెను వెంటనే రైస్‌ ‌మిల్లుకు ధాన్యం తరలించాలని అని, మిల్లులలో ధాన్యం దిగుమతి కి అవసరమగు హమాలీలను సమకూర్చుకోవలని సూచించారు. హమాలి కొరత లేకుండా దగ్గరి గ్రామాల హమాలీలను సమకూర్చుకోవలని తెలిపారు. రైతులకు సకాలంలో చెల్లింపు జరుపటానికి వీలుగా ఓపిఎంఎస్‌ ఆన్లైన్‌ ‌లో రైస్‌ ‌మిల్లు వారు సకాలంలో ఆమోదం తెలపాలని సూచించారు.

మిల్లులలో ఖాళీ అయిన గోనే సంచులను వెంటనే గోదాంలో తిరిగి ఇవ్వాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌నగేష్‌ ‌గారు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌, ఎడి మార్కెటింగ్‌ ‌మెదక్‌ ‌రమ్య, జిల్లా రైస్‌ ‌మిల్‌ అసోసియేషన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌చంద్రపాల్‌, ఇఫ్కో డైరెక్టర్‌, ‌ప్యాక్స్ ‌కొనపూర్‌ ‌చైర్మన్‌ ‌దేవేందర్‌ ‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోములు, అన్ని బాయిల్డ్ ‌మిల్లులు యజమానులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!