కారేపల్లి, జూన్ 12, (ప్రజాతంత్ర విలేకరి) : సింగరేణి మండల పరిధిలోని మాదారం పంచాయతీలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటనలో భాగంగా హాజరైన అడిషనల్ కలెక్టర్ స్నేహలత,మార్గంలో ఉన్న ఈజిఎస్కూలీలతో మాట్లాడారు. ఈ సందర్బంగా కూలీలు చెప్పినదానిపై పంచాయతీ కార్య దర్శి నరేష్‌ను వివరణ అడగ్గా అతను చెప్పినదానికి సంతృప్తిచెందక పని విధానంలో లోటుపాట్లుఉన్నాయని పంచాయతీ సెక్రటరీలు కొంతమందిలో అవగాహన లేక కూలీలతో పనిచేయిస్తున్నారని అందువల్ల కూలీలకు నష్టం వస్తుందని,దీనిపై మండల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగవని,మండల అధికారులు ఆమెకు హామీ ఇచ్చారు.ఇదే సందర్బంగా పంచాయతీ పరిదిలోని వాటర్టాంక్ను వీదు)కు సరఫరాచేసే పాయింట్‌ను పరిశీలించారు.అక్కడ నీరు నిల్వ ఉండి క్రిములు ఉండటం చూసిన ఆమె పంపు ఆపరేటర్‌ను మందలించి శుబ్రం చేసుకోవాలని చెప్పారు. ఆమె వెంట సర్పంచ్ అజ్మీర నరేష్,కార్యదర్శి నరేష్,ఎంపిపి మాలతో శకుంతల, ఎంపిడివో రమాదేవి, డిపిఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.