Take a fresh look at your lifestyle.

పోరాటాలగడ్డ తనయకు ఏడేండ్లు

చాలా మంది చరిత్ర నుంచి ప్రభావిత మవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయ తీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆవిధి సైతం తల వంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయపార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన రోజు జూన్‌ 2 – 2014. ‌నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది

చాలా మంది చరిత్ర నుంచి ప్రభావిత మవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఊగించి, ఉరికించి, శాసించి విజయ తీరాలకు చేర్చారు. ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆవిధి సైతం తల వంచింది. తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయపార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది. భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన రోజు జూన్‌ 2 – 2014. ‌నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ప్రత్యే•క తెలంగాణ ఏర్పాటుకు అకుంటి•త దీక్షతో ఎన్నో సమస్యల వలయాలను చేదించుకుని సాధించే వరకు పట్టువదలని ఘటికుడు కేసీఆర్‌, ‌శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వాన జరిగిన ఉద్యమానికి ఫలితం అందిన రోజు.. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంతో, ఉద్యమ కారుల పోరాటంతో, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి, సరిగా7 సంవత్సరాలు పూర్తయ్యాయి.

నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. కోట్లాది మందిని ఏకం చేసి  ప్రత్యేక రాష్ర ్టసాధన దిశగా సాగింది. ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంతో, ఉద్యమ కారుల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగింది. 1969 నుండి 2014 వరకు వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై  2010లో శ్రీకృష ్ణకమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్‌వర్కింగ్‌ ‌కమిటి తీర్మానం చేసింది. 2013 అక్టోబరు 3న కేంద్రమంత్రి మండలి ఆమోదం లభించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014లో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్‌ 2‌వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

ఆరవై ఏండ్ల స్వప్నం సాకారమైన రోజు జూన్‌ 2. ఎం‌దరో అమరవీరుల బలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈసుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో అధిగమించిన మైలు రాళ్లు
నవంబర్‌ 29, 2009: ‌తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక •చేపట్టడం.
డిసెంబర్‌ 1, 2009 : ‌కేసీఆర్‌ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్‌
‌డిసెంబర్‌ 2, 2009: ‌కేసీఆర్‌కు మద్దతుగా అన్ని జిల్లాల్లో రిలే దీక్షలు ప్రారంభం.
4.డిసెంబర్‌ 09, 2009: ‌తెలంగాణ రాష్ర ్టఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి• •ంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన
డిసెంబర్‌ 23, 2009: ‌తెలంగాణ ఏర్పాటు ప్రకటన సవరించుకుంటూ తెలంగాణ అంశంపై మరింత విస్తృత స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతాయని చిదంబరం మరో ప్రకటన చేశారు.
తెలంగాణ ఐక్యకార్యాచరణ వేదిక ఏర్పాటు
డిసెంబర్‌ 24, 2009:  తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జేఏసీ తొలి సమావేశం.
జనవరి 5 2010: సీమాంధ్రలో సమైక్యఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కేంద్రహోంశాఖ ఢిల్లీలో సమావేశం.
జనవరి 28, 2010 రాష్ర ్టపరిస్థితుల అధ్యయనాని కికమిటీ నియమిస్తున్నటు్ల కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన.
ఫిబ్రవరి 2, 2010 కమిటీ సారథిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌శ్రీకృష్ణ, మరో నలుగురు సభ్యులు, కమిటీ విది •విధానాలు ఖరారు.
డిసెంబర్‌ 30, 2010 ‌జస్టిస్‌ ‌శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్ర ద్ర హోంశాఖకు సమర్పణ.
జనవరి 6, 2011: శ్రీకృష ్ణకమిటీ నివేదిక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో రెండో  సారి అఖిల పక్ష సమావేశం. ఈ సమావేశానికి హాజరు కానిటీఆర్‌ఎస్‌, ‌బీజేపీ
మార్చ్ 10, 2011: ‌సకలజనులతో మిలియన్‌ ‌మార్చ్
‌సెప్టెంబర్‌ 13, 2011 ‌నుంచి తెలంగాణరాష్ట్రం ఏర్పాటు చేయాలని సకల జనుల సమ్మె ప్రారంభం. ఇది 42 రోజుల పాటు కొనసాగింది.
డిసెంబర్‌ 28, 2012: ‌కేంద్రహోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో భేటీ
జులై 12,2013: తెలంగాణరాష్ర ్టఏర్పాటుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ ‌ఖరారు
జులై 31, 2013: ఢిల్లీలో యూపీఏ మిత్రపక్షాల సమావేశం. హైదరాబాద్‌ ‌రాజధానిగా పదిజిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
అక్టోబర్‌ 3, 2013: ‌సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేం•ద్ర  మంత్రి వర్గం ఆమోదం.
అక్టోబర్‌8, 2013 : ‌రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రులతో జీఎంవో ఏర్పాటు.
2013 నవంబర్‌ 12, 13‌వ తేదీలో్ల రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలతో జీఎంవో సమావేశం.
2013 డిసెంబర్‌ 12‌వతేదీ: రాష్ర ్టఏర్పాటు బిల్లుపై శాసనసభ అభిప్రాయానికై ఏపీఅసెంబ్లీకి రాష్ట్రపతి బిల్లు ప్రతులు.
జనవరి 30 2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ, బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం.
ఫిబ్రవరి 13, 2014: లోక్‌సభకు తెలంగాణ బిల్లు
ఫిబ్రవరి 18, 2014 : తెలంగాణబిల్లుకు లోక్సభ ఆమోదం.
ఫిబ్రవరి 20, 2014: తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.
మార్చ్ 1, 2014: ‌తెలంగాణ రాష్ర ్టఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
మార్చ్ 4 2014: ‌తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై•గె జిట్‌ ‌విడుదల
జూన్‌ 2 2014: ‌తెలంగాణ రాష్ట్రం అమల్లోకి వచ్చింది.
రాష్ట్రం ఏర్పడి, నేటికి సరిగ్గా ఏడేండ్లు పూర్తయ్యాయి. ఈఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం ఎటువైపు పయని ంచింది? అభివృద్ధి తీరు ఎలా ఉంది? స్వరా ష్ట్రపాలనలో విస్మరించిన విఏంటి? అనిఆరాతీస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులతో కళకళలాడుతోంది. మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భ•గీరథ వంటి పథకాలు రాష్ట్రానికి వెన్నెముకలా మారాయి.

- Advertisement -

ఇక, రైతు బంధు దేశచరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. రైతు బీమా, కేసీఆర్‌ ‌కిట్లు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. ఐటీలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి దిక్సూచిలా మారింది. అటు, పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పరిశ్రమలకు రాయితీలతోపాటు సింగిల్విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు టీఎస్‌ఐపావి ప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగాజాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడింది.

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా కూడా పెట్టుబడిదారులకు అనుకూలమైన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం ఉండేలా ప్రభుత్వం తెలంగాణ స్టేట్‌ ఇం‌డస్ట్రియల్ప్రాజెకు్ట అప్రూవల్‌ •సెల్ఫ్సర్టిఫికేషన్సిస్టమ్‌ ((TS-IPASS) ‌చట్టం చేసి, సులభతర అనుమతుల విధానం ప్రవేశపెట్టింది. విద్యాపరంగానూ రాష్ట్రం అభివృద్ధి సాధించింది. తెలంగాణ ఏర్పాటు కాక ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి కేవలం 298 (261ం37 జనరల్‌) ‌రెసిడెన్షియల్స్కూళ్లు మాత్రమే ఉండేవి. కొత్తగా 661 (608 స్కూళ్లు, 53 డిగ్రీ కాలేజీలు) రెసిడెన్షియల్స్కూళ్లు ప్రారంభించిన ప్రభుత్వం మొత్తం రెసిడెన్షియల్స్కూళ్ల సంఖ్యను 959 (906ం53 డిగ్రీకాలేజీలు) కితీసుకువచ్చింది.ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ, ఇటీవల ప్రైవేట్టీచర్లకు లాక్డౌన్కాలానికి 2000 లసహాయం, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇటీవల వైస్ఛాన్సలర్లని ప్రకటించడం జరిగింది.

అయితే, ప్రత్యేక రాష్ట్రంవస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ విద్యావంతులకు భంగపాటె ఎదురైందనే చెప్పాలి. ప్రధానంగా, జూనియర్లెక్చరర్‌, ‌డిగ్రీలెక్చరర్‌,  ‌యూనివర్సిటీస్థాయి ఖాళీలు, నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో భర్తీచేయాల్సిన ఉద్యోగాలు,  గ్రూప్‌ 1 ‌గ్రూప్‌ 2 , ఉద్యోగాలు ఇలా, చాలాఉద్యోగాలకోసం దాదాపుద శాబ్దకాలంగా వేచి చూస్తున్న నిరుద్యోగులు పెద్ద సంఖ్య లోఉండటం గమనార్హం.దీనికితోడు ఇటీవల పదవి విరమణ వయస్సు పెంచడంతో నిరుద్యోగుల ఆశలపైనీళ్లుచల్లినట్లు అయ్యింది. తెలంగాణలో 2.86 లక్షలఉద్యోగాలను భర్తీచేయాల్సి ఉండగా, ఈ 7 సంవత్సరాలలో 27 వేలకుపైగా మాత్రమే ఖాళీల భర్తీ జరిగిందని విద్యార్థి సంఘాలు వాదిస్తున్నాయి. మరో వైపుమిగులురాష్ట్రంగా ఏర్పడి సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలోటు బడ్జెట్లోకెళ్ళింది. దీనికి తోడు కొరోనా, లాక్డౌన్లవల్ల రాష్ర ్టఆదాయానికి గండి పడిందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని ప్రధానంగాఉన్న నిరుద్యోగ సమస్యను పారద్రోలి నట్లయితే బంగారు తెలంగాణను త్వరలోనే చూడొచ్చు. కొరోనాతో ఉత్పన్నమైన ఆర్థిక మరియు ఆర్థికే తరసమస్యలను అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు.

– డాక్టర్‌ఎం‌డిఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్ఫైనాన్స్
‌తెలంగాణసామాజిక రచయితల సంఘం రాష్ట్రకార్యవర్గసభ్యులు
9492791387

Leave a Reply