Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులపై కార్యాచరణ

  • హైదరాబాద్‌ ‌రోడ్డు పనులకు ప్రతిపాదనలు
  • అధికారులతో సక్షించిన మంత్రి కెటిఆర్‌

‌హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్‌ అధికారులను మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌పరిధిలో జీహెచ్‌ఎం‌సి చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయాలని కూడా మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. బుధవారం జీహెచ్‌ఎం‌సి కార్యాలయంలో ఎస్‌ఆర్‌డిపి కింద మంజూరైన ప్లయ్‌ఓవర్లు, అండర్‌ ‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ ‌బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణపనులు, మెట్రోలైన్‌ ‌నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మంచినీటి సరఫరా,పైప్‌లైన్‌లు, క్రీడా మైదానాల నిర్మాణం తదితర పనులపై మంత్రి సక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో పైప్‌లైన్‌ల లీకేజీల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు దెబ్బతిన్న పైప్‌లైన్‌ల స్థానంలో కొత్త పైప్‌లైన్‌లు వేయాలని అన్నారు. చివరి ప్రాంతాలకు తాగునీటి సరఫరా చేసుందుకు కొత్తగా పైప్‌లైన్‌లను నిర్మించాలని కూడా తెలిపారు. ఈ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్ధను ఆధునీకరించేందుకు నాలాల విస్తరణకు 200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్టు తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 20రోడ్లను వెడల్పు చేసేందుకు ప్రతిపాదిత మెట్రోరైలు మార్గంలో పనులుచేట్టేందుకు అవసరమైన భూసేకరణ పక్రియను వేగవంతం చేయాలన్నారు. రోడ్ల విస్తరణకు సానుకూలంగా స్పందించిన వారి ఆస్తులను వెంటనే సేకరించాలని అన్నారు. నిబంధనల ప్రకారం చెల్లింపులుజరిపి సంబంధిత ఆస్తులను స్వాదీనం చేసుకుని నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. భూసేకరణలో పార్లమెంట్‌ ‌శాసన సభ్యుల సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పుతో ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి రైల్వే అండర్‌పాస్‌ ‌పనులను పూర్తిచేయాలని సూచించారు.

ఈస్ట్, ‌వెస్ట్ ‌కారిడిర్‌లో భాగంగా మూసీ నదికి ఇరువైపులా నాలుగులేన్లరోడ్లునిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిపారు. స్థలాల అందుబాటును బట్టి గజ్వేల్‌ ‌తరహాలో ఇంటి గ్రేటెడ్‌ ‌మోడల్‌ ‌మార్కెట్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ పెరిగినందున పార్కులలో ఓపెన్‌ ‌జిమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఎంఐఎం శాసన సభాపక్షం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ, మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌మహ్మద్‌బాబాఫసియుద్దీన్‌, ‌జీహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌లోకేశ్‌కుమార్‌, ‌వాటర్‌బోర్డు ఎండి దాన కిషోర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!