Take a fresh look at your lifestyle.

కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చర్యలు

  • తిరిగి వస్తున్న వలస కార్మికుల రాకతో అప్రమత్తం
  • ప్రతి గ్రామంలో 10 మందికి క్వారంటైన్‌ ఉం‌డేలా చర్యలు
  • ఒడిషా కార్మికుల సమస్యపై
  • సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌, ‌కేంద్రమంత్రితో చర్చ
  • అధికారులతో సక్షించిన సిఎం వైఎస్‌ ‌జగన్‌
  • ‌లక్షకు తగ్గకుండా బెడ్లు సిద్దం చేయాలని ఆదేశం

అమరావతి,మే 2 : కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్‌మెంట్‌ ‌జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలను సీఎం ఆదేశం మేరకు అధికారులు తయారుచేస్తున్నారు. కోవిడ్‌ -19 ‌నివారణా చర్యలపై సీఎం వైఎస్‌.‌జగన్‌ ‌సక్షించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్‌-19 ‌పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ ‌వసతి కల్పించి వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.నీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ ఈ ‌మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్‌ -19 ‌క్వారంటైన్‌ ‌చర్యలు చేపట్టాలని సూచించారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ ‌వాహనాలుగా మార్చాలని సీఎం చెప్పారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు డాక్టరు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్‌ ‌యూనిట్‌కు అందుబాటులో ఉంటారు. ఇకపోతే మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తామని సీఎం జగన్‌ ‌ప్రకటించారు. దుకాణాల వద్ద ప్రజలు పాటించాల్సిన మార్గదర్శకాలు అధికారులు చెప్పాలని సూచించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై జగన్‌ ‌సక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సూచన మేరకు కంటైన్‌మెంట్‌ ‌జోన్లు గుర్తించాలని, కంటైన్‌మెంట్‌ ‌జోన్లలో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు జగన్‌ ‌సూచనలు చేశారు. మార్కెట్‌ ఇం‌టెలిజెన్స్ ‌వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటుకు.. విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జూన్‌ 6‌న మత్స్యకార భరోసా పథకం కోసం ఏర్పాట్లు చేయాలని జగన్‌ ఆదేశించారు. అలాగే ఒడిశా సీఎం నవీన్‌ ‌పట్నాయక్‌, ‌కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌మధ్య శనివారం వీడియో కాన్ఫరెన్స్ ‌జరిగింది. లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలు, కార్మికుల తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. అలాగే ఒడిశాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ‌పౌరులను తరలించే విషయమై కూడా చర్చలు జరిగాయి. తమ రాష్ట్రానికి చెందిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు కల్పించి ఆదుకున్నందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ‌సీఎం వైఎస్‌ ‌జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలనుకుంటున్న ఒడిశా వారికి మంచి వసతి, భోజన సదుపాయాలు అందించారని ఒడిషా సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌ అన్నారు. అంతేకాక మా రాష్ట్రానికి వస్తున్న వారికి అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమన్వయం చేస్తున్నాం. కోవిడ్‌ ‌వల్ల తలెత్తిన క్లిష్ట పరిస్ధితుల్ని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. ధన్యవాదాలని పేర్కొన్నారు.సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మాట్లాడుతూ.. ’ అభ్యర్థనను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం నవీన్‌ ‌జీ అని అన్నారు. దాదాపు 20 వేల మంది ఒడిశా ప్రజలు మా రాష్ట్రంలో ఉన్నారు. రిలీఫ్‌ ‌క్యాంపులలో ఉంటున్నవారిలో దాదాపు 1900 మందికిపైగా ఒడిశా వెళ్లడానికి సిద్దంగా ఉన్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మిగిలిన వారిని కూడా వారు పనిచేస్తున్న చోటే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవేళ వారిలో ఎవరైనా తిరిగి ఒడిశా వెళ్లేందుకు సిద్దమైతే వారిని కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తాం అని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌, ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌తో మాట్లాడారు. విపత్తు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒడిశా కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన ప్రజలను బాగా చూసుకుంటున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్‌ ‌నివారణలో బాగా పనిచేస్తున్నారంటూ సీఎంను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

Leave a Reply