Take a fresh look at your lifestyle.

పరిశుభ్రత లోపిస్తే చర్యలు తప్పవు – వేగవంతంగా రైతు వేదికలు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్‌ ఎల్‌ ‌శర్మన్‌ ‌చౌహాన్‌

‌తెలకపల్లి , ఆగష్టు 26. ప్రజాతంత్ర విలేకరి: తెలకపల్లి గ్రామాలలో పరిశుభ్రత లోపిస్తే చర్యలు తప్పవని నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఎల్‌ ‌శర్మన్‌ ‌చౌహాన్‌ ‌హెచ్చరించారు బుధవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి తెలకపల్లి దాసు పల్లి, అనంతసాగర్‌, ‌గట్టురాయిపాకుల, గడ్డంపల్లి , పెద్దూరు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాలలో రైతు వేదికల పనులు ప్రారంభం కాకపోవడంతో వెంటనే ప్రారంభించాలని పనులలో అలసత్వం వద్దని సెప్టెంబర్‌ 30 ‌లోగా రైతు వేదిక ను పూర్తిచేయాలని ఆదేశించారు అదేవిధంగా పెద్దూరు లో నిర్మాణం జరుగుతున్న రైతు వేదిక పనులను పరిశీలించారు పల్లె ప్రగతి వనం వైకుంఠ దామాలు డంపింగ్‌ ‌యార్డ్ ‌మొదలైన పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మండల కేంద్రంలోని ఎండోమెంట్‌ ‌భూములలో అక్రమంగా డబ్బాలు ఏర్పాటుచేసిన వాటిని వెంటనే తొలగించాలని జిపి అధికారులను సర్పంచ్‌ ‌ల ని కోరడంతో ఎండోమెంట్‌ ‌లెటర్‌ ‌మేరకు తొలగించడానికి వెళ్లగా డబ్బాల నిర్వాహకులు రోడ్డుకు 33 ఫీట్ల దూరంలో  వెనక్కి వేసుకుంటామని దరఖాస్తు చేస్తామని కొంత సమయం ఇవ్వాలని కోరడంతో దరఖాస్తు చేయాలని సూచించారు గ్రామాల పరిశుభ్రత ఉండేలా చూడాలని సూచించారు గ్రామాలలో చెత్తాచెదారం ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు లేకుండా సమావేశం ఏర్పాటు చేసి  సూచించాలని కోరారు ఈ కార్యక్రమంలో డి ఎల్‌ ‌పి ఓ రామ్మోహన్‌ ‌రావు ఎంపీవో వెంకట్‌ ఈవో బాలరాజు తెలకపల్లి సర్పంచి సురేఖ బాలగౌడ్‌, ఉప సర్పంచ్‌ ఆర్‌.‌కృష్ణయ్య దాసు పల్లి సర్పంచ్‌ ‌పార్వతమ్మ, అనంతసాగర్‌ ‌సర్పంచ్‌ ‌విష్ణు, గట్టురాయిపాకుల సర్పంచ్‌ ‌లక్ష్మి శ్రీను, పెద్దూరు సర్పంచ్‌ ‌శైలజ భాస్కర్‌ ‌రెడ్డి, ఎంపిటిసి లింగమయ్య, ఉప సర్పంచ్‌ ‌చంద్రయ్య తెలకపల్లి ఈవో బాలరాజు వార్డు సభ్యులు సాయిరాం మాజీ ఉప సర్పంచ్‌ ‌బాలగౌడ్‌ ‌జి పి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply