Take a fresh look at your lifestyle.

ధాన్యం పేమెంటులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు

  • జాప్యం లేకుండా రైతులకు చెల్లింపులు చేయాలి
  • ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలి
  • టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి  ఆదేశం
  • సిద్ధిపేట ఏఎంసి కార్యదర్శికి ఛార్జ్ ‌మెమో

సిద్ధిపేట, మే 15 (ప్రజాతంత్ర బ్యూరో): యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి నిధుల కొరత లేకుండా, రైతులకు సమయానికి చెల్లింపులు చేసేందుకు వీలుగా కావాల్సిన 26 వేల కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పౌరసరఫరాల సంస్థకు సమకూర్చారని సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి తెలిపారు. నిధుల కొరత లేనందున జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులకు జాప్యం లేకుండా వేగంగా చెల్లింపులు జరపాలని హొసంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోగా రైతుల ఖాతాకు డబ్బులు జమ అయ్యేలా చూడాలనీ క్లస్టర్‌ ఇం‌ఛార్జిలు, కేంద్రాల బాధ్యులను అదేశించారు. శనివారం ములుగు కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, చెల్లింపుల తీరుతెన్నులపై ఆర్డీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు, క్లస్టర్‌ ఇం‌ఛార్జిలైన మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు, మండల వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇంఛార్జిలు, జిల్లాలోని 127 మంది వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు(ఏఈవో)లు, ఎపిఎంలు, రైస్‌ ‌మిల్లుల సిట్టింగ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల 534 మంది రైతుల నుంచి రూ.259 కోట్ల 82 లక్షల విలువైన ఒక లక్షా 37 వేల 619 మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

వచ్చే మూడు రోజుల్లో అందరికీ చెల్లింపులు చేయాలన్నారు. ఆర్డీవోలు, క్లస్టర్‌ ఇం‌ఛార్జిలైన మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలో వారికి కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రోజూ వారీగా వచ్చిన ధాన్యం , లోడింగ్‌, అన్‌ ‌లోడింగ్‌, ‌ట్రక్‌ ‌షీట్‌, ‌ట్యాబ్‌ ఎం‌ట్రీ పురోగతి పై క్షేత్ర అధికారుల తో ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం వచ్చిన ధాన్యంను వెంటనే రైస్‌ ‌మిల్లులకు తరలించేలా చూడాలన్నారు.  ప్రతి రోజూ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు మొత్తం ట్యాబ్‌ ఎం‌ట్రీ అయ్యేలా క్లస్టర్‌ ఇం‌చార్జీ లు బాధ్యత తీసుకోవాలన్నారు. డివిజన్‌ ‌ల వారీగా ధాన్యం కొనుగోళ్లు, ట్యాబ్‌ ఎం‌ట్రీ పురోగతిపై ఆర్డీవోలు రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలన్నారు. రైతులకు తక్షణం చెల్లింపులు చేయడానికి వీలుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారి వివరాలను త్వరితగతిన ఆన్‌లైన్‌ ‌ప్రొక్యూర్‌మెంట్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌సిస్టం(ఓపీఎంఎస్‌)‌లో నమోదు చేసేలా చూడాలన్నారు.  ఆదివారం సాయంత్రంలోగా పెండింగ్‌ ‌పేమెంట్లను క్లియర్‌ ‌చేయాలన్నారు.

హుస్నాబాద్‌ ‌రెవెన్యూ డివిజనల్‌ ‌పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెండింగ్‌ ‌ట్యాబ్‌ ఎం‌ట్రీలపై సంబంధిత ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ‌సూచించార . హుస్నాబాద్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ సెక్రెటరీ, హుస్నాబాద్‌ ‌పాక్స్ ‌పర్సన్‌ ఇం‌ఛార్జిలను విచారించి పెండింగ్‌ ‌ట్యాబ్‌ ఎం‌ట్రీ తక్షణమే క్లియర్‌ ‌చేయాలని కలెక్టర్‌ ‌సూచించారు. ధాన్యం కొనుగోలు చెల్లింపుల్లో పూర్‌ ‌పెర్ఫార్మెన్స్ ఉన్న అధికారులతో ఈ నెల 19న కలెక్టరేట్‌ ‌నందు సమీక్ష నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్‌ ‌తెలిపారు. అప్పటికల్లా ధాన్యం కొనుగోలు కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్‌ ‌పేమెంటులను పూర్తి చేయాలన్నారు. అలక్ష్యం చేస్తే బాధ్యుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 ఆ వాహనాలకు లాక్‌డౌన్‌ ‌నుంచి మినహాయింపు….
జిల్లాలో ధాన్యం తరలింపులో భాగస్వామ్యయ్యే వాహనాలకు లాక్‌డౌన్‌ ‌నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చామని కలెక్టర్‌ ‌తెలిపారు. సదరు వాహనాలకు పాస్‌లు జారీ చేసే అధికారాన్ని జిల్లా వ్యవసాయ అధికారికి అప్పగించామని కలెక్టర్‌ ‌పేర్కొన్నారు. ధాన్యం తరలింపు కు సరిపడా లారీలను ట్రాన్స్‌పోర్టర్లను సమకూర్చకపొతే స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, ఇతర వాహనాలను క్లస్టర్‌ ఇం‌ఛార్జిలు ధాన్యం తరలింపుకు ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ ‌సూచించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సిద్ధిపేట ఏఎంసి కార్యదర్శికి ఛార్జ్ ‌మెమో…
ధాన్యం కొనుగోళ్లు, ట్యాబ్‌ ఎం‌ట్రీ, పేమేంట్‌లలో నిర్లక్ష్యం వహించిన సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ కార్యదర్శి ప్రభాకర్‌ ‌రెడ్డికి ఛార్జ్ ‌మెమో జారీ చేయాలని జిల్లా మార్కెటింగ్‌ అధికారిని కలెక్టర్‌ అదేశించారు. కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేసి, మిల్లులో అన్‌లోడింగ్‌ అనంతరం వెంటనే ట్యాబ్‌ ఎం‌ట్రీ పూర్తి చేయాల్సి ఉండగా, ఏఎంసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 వేల క్వింటాళ్ల ధాన్యం ట్యాబ్‌ ఎం‌ట్రీ కాకుండా పెండింగ్‌ ఉం‌ది. దీంతో జిల్లా కలెక్టర్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ కార్యదర్శి ప్రభాకర్‌ ‌రెడ్డిని బాధ్యుడిగా గుర్తించి మెమో జారీకి ఆదేశాలు జారీ చేశారు. ములుగు నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌  ‌ముజమిల్‌ ‌ఖాన్‌, ‌డిఆర్‌డివో  గోపాల్‌రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌, ‌జిల్లా పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply