Take a fresh look at your lifestyle.

సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి

మధిర, మే 27 (ప్రజాతంత్ర): మధిర మున్సిపాల్టీ పరిధిలో వచ్చే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ ‌వ్యాధుల రాకుండా మున్సిపాల్టీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి.కర్ణన్‌ ‌తెలిపారు. బుధవారం మధిర మున్సి పాల్టీ కార్యాలయం నందు జరిగిన 2020 బడ్జెట్‌ ‌సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని, సీజ నల్‌ ‌వ్యాధుల రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంత రం 2020 బడ్జెట్‌లో మున్సిపాల్టీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ఆయన తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. బడ్జెట్‌కు సంబంధించిన చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వార్డు కౌన్సిలర్ల సమక్షంలో తీర్మా నాలు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌స్నేహలత, తహశీల్దార్‌, ఇన్‌చార్జి కమీషనర్‌ ‌డి.సైదులు, మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌ ‌మొండితోక లత, టిఆర్‌ఎస్‌ ‌జిల్లా నాయకులు మొండితోక జయాకర్‌, ‌భరత్‌ ‌వెంకటరెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply