వివిధ ప్రాంతాలలో చేపడుతున్న అభివృద్ది పనుల పూర్తికి వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో డంపింగ్ యార్డులకు,వైకుంఠదామాలకు స్థల సేకరణపై సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డంపింగ్ యార్డు, వైకుం ఠదామాల గ్రౌండింగ్ ఆనుకున్నంతగా లేదని, దీనిపై దృష్టి సారించాలన్నారు. వీటి కోసం స్థల సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయ్యాలని, 49 వైకుంఠదామాల నిర్మాణాలు పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విబాగానికి అప్పగించగా, స్థల అప్పగింత జరుగక పనులు ప్రారంభించలేద న్నారు. అటవీ భూములున్న గాని చట్ట ప్రకారం అనుబవ హక్కులు గ్రామ పంచాయితీకి చెందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా గ్రామాభి వృద్ది అధికారి సంబందిత గ్రామాల పంచాయితీ కార్యదర్శి సర్పంచ్లకు స్థలాల పూర్తి వివరాలు పోందు పర్చేలాఅదేశాలు ఇవ్వాలన్నారు. పంచాయితీ రాజ్ ఇఇ, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోని సమస్యలున్న స్థలాలపై పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అటవి శాఖ అధికారి ప్రదీఫ్ శెట్టి,రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి,జెడ్పీ సీఈవో ఏ.పారిజాతం, ఇఇ పిఅర్ రాంబాబు, అటవీ రేంజ్ అధికారులు శంకర్, గౌతమ్, రామ్మోహన్, మాధవి,శీతల్,ఆసీఫ్ పాల్గన్నారు.
సమస్యలపై దృష్టి పెట్టాలి
ప్రజలు సమర్పించే సమస్యలపై సంబందిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిస్కారంమార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్బంగా కలెక్టర్ తన కార్యాలయంలో ప్రజల విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రజలు సమర్పిం చిన వాటిలో భూ సమస్యలకు సంబందించి 27, ఆసరా పెన్షన్ల గురించి 8, ఇతర శాఖల కు సంబందించి 8 మొత్తం 43 విజ్ఞప్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్య ఉన్నట్లు ధరఖాస్తు సమర్పించిన వెంటనే ధరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ను సేకరించి ధరఖాస్తు వివరాలు తెలుపా లన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి, సీఈవో పారిజాతం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఇడి తుల రవి, సాంఘీక సంక్షేమ శాఖ అధికారి భాగ్యలక్ష్మి,మల్లీశ్వరీ,గౌస్ హైదర్ పాల్గోన్నారు.