Take a fresh look at your lifestyle.

లఖింపూర్‌ ‌ఘటనపై చర్యలు తీసుకోవాలి

  • మద్దతు ధరలపై చట్టం చేయాలి
  • ప్రధాని మోడీకి ఎంపి వరుణ్‌ ‌గాంధీ లేఖ

న్యూ దిల్ల్లీ, నవబంర్‌20: ‌పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సాగుచట్టాలను రద్దుచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వెంటనే మద్దతు ధరలపై ప్రకటనచేయాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతు పంటలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తక్షణమే నిర్ణయం చేయాలని తన లేఖలో కోరారు. రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న మూడు సాగు చట్టాలను ప్రధాని మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేపడుతున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం చట్టాన్ని చేయాలని ఎంపీ వరుణ్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు చేస్తూ సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా కోటి ఇవ్వాలని వరుణ్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు.

లఖింపూర్‌ ‌ఖేరీ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీజేపీ ఎంపీ వరుణ్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి వరుణ్‌ ‌గాంధీ లేఖ రాశారు.ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి పేరు వినిపించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వరుణ్‌ ‌గాంధీ కోరారు. రైతుల సమస్యలపై ప్రధాని మోదీకి రాసిన లేఖను వరుణ్‌ ‌గాంధీ శనివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాలని వరుణ్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు.

కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రాతో వేదిక పంచుకోవద్దు ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ లేఖ
కేంద్ర మంత్రి అజయ్‌ ‌మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆమె లేఖ రాశారు. ప్రధాని ఉద్దేశం పారదర్శకమైతే కేంద్ర మంత్రితో వేదిక పంచుకోవద్దని, మంత్రిని పదవి నుంచి సాగనంపాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు. డీజీపీ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని శనివారంనాడు లక్నోలో ఉన్నారు. లఖింపూర్‌ ‌ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్‌ ‌మిశ్రా తనయుడు ఆశిష్‌ ‌మిశ్రా అరెస్టయిన నేపథ్యంలో కేంద్ర మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ ‌మొదట్నించీ డిమాండ్‌ ‌చేస్తోంది.రైతుల విషయంలో ఉద్దేశం స్పష్టంగా ఉంటే హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌మిశ్రాతో ఒకే వేదక పంచుకోవద్దు. ఆయనను డిస్మిస్‌ ‌చేయండని ఆ లేఖలో మోదీని ప్రియాంక కోరారు.

వివాదాస్పద మూడు సాగు చట్టాలను తమ ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రధాని శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్‌ 3‌న లఖింపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో నలుగురు రైతులతో సహా ఎనిమది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు సంబంధించి ఆశిష్‌ ‌మిశ్రా సహా 13 మందిని అరెస్టు చేశారు. అజయ్‌ ‌మిశ్రా వాహనంతో పాటు మూడు వాహానాల కాన్వాయ్‌ ‌రైతుల ద నుంచి దూసుకుపోవడంతో నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లఖింపూర్‌ ‌హింసాత్మక ఘటనలపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్‌, ‌హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాకేష్‌ ‌కుమార్‌ ‌జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది.

Leave a Reply