బూర్గంపాడు: మండల పరిధిలోని సారపాక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న వ్యవసాయ భూములు కొందరు వ్యాపారులు అనుమతులు లేకుండా సీతారామ ప్రాజెక్టు నుండి అక్రమ మట్టిని నిలుపుతున్నారని విషయం తెలుసుకున్న మండల స్థాయి మాలమహనాడు సభ్యులు గురువారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూశాఖ అధికారులు కళ్ళు కప్పి అనుమతులు లేకుండా అక్రమ మట్టిని నింపడాన్ని వ్యతిరేకిస్తున్నామని వ్యవసాయ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వం అనుమతులు లేకుండానేన ప్లాట్లు చేసి కోట్ల రూపాయలను వ్యాపారం చేయటంలో మునిగిపోయారని రెవెన్యూ శాఖ క్రింది స్థాయి అండదండలతోనే ఇదంతా జరుగుతుందని వారు తెలిపారు. సారపాకలో రోజురోజుకు ఇలాంటివి పెరిగిపోతున్నాయని వీటిపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల మాలమహనాడు నాయకులు కోరారు. లేని పక్షంలో ఆంధోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాలమహనాడు మండల అధ్యక్షులు తుమ్మల కిరణ్, స్వామిదాస్, క్రాంతికుమార్ రామకృష్ణ, దాసు తదితరులు పాల్గొన్నారు.