Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ‌స్కూళ్లు ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో ఫీజుల దోపిడీ నిర్వహిస్తున్నారని వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యకు ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా అధ్యక్షుడు ధర్మబిక్షం మెమోరాండం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నియామకాలకు విరుద్దంగా తరగతులు నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనం ఉన్నారని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు చదువు అవసరం లేదా, ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా ప్రైవేట్‌ ‌స్కూల్‌ ‌యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తూ తరగతులు నిర్వహించడం సరైంది కాదన్నారు. వెంటనే డీఈవో చర్యలు తీసుకోని యెడల రాస్తారోకో నిర్వహిస్తామన్నారు. మెమోరాండం అందించిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, అశోక్‌ ‌రెడ్డి, తదితరులున్నారు.

Leave a Reply

error: Content is protected !!