Take a fresh look at your lifestyle.

రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి

రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విజయ రమణారావు
మందల రాజిరెడ్డి ఆత్మహత్య కు కారణమైన రెవెన్యూ అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. కాల్వ శ్రీరాంపూర్‌ ‌తహశీల్దార్‌ ‌కార్యాలయం ముందు శనివారం ఆత్మహత్య చేసుకున్న మందల రాజిరెడ్డి కుటుంబాన్ని రెడ్డిపల్లిలో సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ మృతుడు రాజిరెడ్డి గత రెండు సంవత్సరాలుగా తన భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ ఇవ్వాలని తహశీల్దార్‌ ఆఫీస్‌ ‌చుట్టూ తిరిగినప్పటికి పని కాలేదన్నారు. రెవెన్యూ అధికారులు ముడుపుల కొరకు రాజిరెడ్డిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులు తీవ్రఇబ్బందులు గురవుతున్నట్లు ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ ‌విధానాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. రాజిరెడ్డి మృతిపై మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎవరు స్పందించకపోవడం దారుణమన్నారు. రాజిరెడ్డి ఈనెల 20వ తేదిన చనిపోతే జనవరి 1 అని రికార్డుల్లో రాయడం అధికారుల పనితీరుకు నిదర్శనమని ఆయన నిప్పులు చెరిగారు. మృతుడు రాజిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం రూ.20లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయ రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. నాయకులు తిరుపతిరెడ్డి, భగవాన్‌రెడ్డి, సతీష్‌, ‌సదయ్య, భాస్కర్‌ ‌రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

డిసిసి అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పరామర్శ…
కాల్వ శ్రీరాంపూర్‌లోని రెడ్డిపల్లి గ్రామం వెళ్ళి మందల రాజిరెడ్డి కుటుంబాన్ని సోమవారం పెద్దపల్లి డిసిసి అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య పరామర్శించారు. అనంతరం కొమురయ్య మాట్లాడుతూ మృతుడు రెండు సంవత్సరాలు తహశీల్దార్‌ ఆఫీస్‌ ‌చుట్టూ తిరిగి రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించిన కూడా రాజిరెడ్డి పని చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు మృతుడి భూమిని మరొకరి పేరు రిజిస్ట్రేషన్‌ ‌చేసి మానసిక క్షోభకు గురిచేసినట్లు ఆయన ఆరోపించారు. గతంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ ‌తహశీల్దార్‌పై జరిగిన దాడి ఘటనను ఆయన ప్రస్తావించారు. పెద్దపల్లి కలెక్టర్‌ ‌మృతుడు రాజిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌నాయకులు భూషనవేని రమేష్‌ ‌గౌడ్‌, ‌కల్వల శ్రీనివాస్‌, ఎం‌డి మునీర్‌ ‌సబ్బని, రాజమట్లు, ఎండి రహీం, ఎస్పీ రాజయ్య, మేడి అశోక్‌ ‌గౌడ్‌, ‌కట్కూరి రాజిరెడ్డి, వేమా రెడ్డి, మంతెన లక్ష్మణ్‌, ‌పాల రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply