- పార్టీ మారిన 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు
- మొయినాబాద్ పిఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
- కెసిఆర్ అహంకారానికి సమాధి కట్టాలన్న రేవంత్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. కేసీఆర్ 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందిని తమవైపు తిప్పుకొని విలీనం చేసుకుంటే తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకర్ ఓకే చెప్పారని అన్నారు. అలా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సబితకు మంత్రి పదవి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డికి ఆర్థిక పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు పొందారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్లోకి జంప్ అయిన 12 మంది ఎమ్మెల్యేలపై ఇన్నాళ్లకు తెలంగాణ పీసీసీ దృష్టి పెట్టింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రలోభాలకే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత పొందిన లబ్ది, ఆర్థిక పరమైన లావాదేవాలపై ఆధారాలతో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
26నుంచి రేవంత్ పాదయాత్రకు సన్నాహాలు
పాదయాత్ర ప్రారంభ స్థలిపై త్వరలోనే స్పష్టత
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 26 నుండి పాదయాత్ర చేస్తామని చెప్పారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై మూడు ప్రాంతాలు పరిశీలనలో వున్నాయని తెలిపారు. భద్రాచలం, జోడేఘడ్, జోగులాంబ వీటిలో ఏదోఒకటి ప్లేస్ ఫైనల్ అవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జీ వచ్చిన తర్వాత ్గనైల్ చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 19 కిలోటర్లు, 126 రోజులు యాత్ర ఉంటదని తెలిపారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని డియా చిట్ చాట్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ యాత్ర చేయనున్నారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుందని చెప్పారు. ఇటీవల మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భేటీలోనూ పాదయాత్రకు సంబంధించి రేవంత్ చర్చించినట్లు సమాచారం. అందుకు ఖర్గే కూడా సుముఖత వ్యక్తం చేశారని రేవంత్ వర్గం నాయకులు చెబుతున్నారు.