Take a fresh look at your lifestyle.

రైతులను ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు : కలెక్టర్‌

ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది గురిచేసి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌డాక్టర్‌ ఎం‌వి రెడ్డి తెలిపారు.  గురువారం దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోన వ్యాధి నియంత్రణకు లాక్‌ ‌డౌన్‌ ‌పాటిస్తున్న  నేపథ్యంలో నిరుపేదల ఆకలిని తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న 12  కేజీల బియ్యం,  పదిహేను వందల రూపాయలు నగదు పంపిణీ జరిగిన తీరును  తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించడానికి వచ్చానని ఆయన చెప్పారు.

పూనం జానకమ్మ ఇంటికి వెళ్లి బియ్యం,  నగదు  పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు రేషన్‌ ‌కార్డు  లేకపోవడం వల్ల బియ్యం పంపిణీ చేయలేదని  చెప్పగా ఎందుకు చేయలేదని తహశీల్దారును ప్రశ్నించారు. అర్హులకు ఎంతమందికి ప్రభుత్వ సహాయం అండలేదో   సమగ్ర నివేదికలు అందజేయాలని తాసిల్దార్‌ ఆదేశించారు.   తనకు రేషన్‌ ‌కార్డు లేకపోవడంవల్ల ప్రభుత్వ సహాయం అందించలే కపోయామని చెప్పారు. ఇది చాలా అన్యాయమని కడు నిరుపేదలకు కూడా ప్రభుత్వం అందిస్తున్న సాయం అందచేయకపోతే ఎలా ఇంత అన్యాయమా ఏంటి ఈ పరిస్థితి అని అధికారుల ను ప్రశ్నించారు.  జానికమ్మకు ఎందుకు రేషన్‌ ‌కార్డు మంజూరు చేయలేదని తాసిల్దార్‌ ‌ప్రశ్నించారు అర్హులైన ఇప్పటికీ తనకు రేషన్‌ ‌కార్డు జారీ చేయడంలో అలసత్వం వహించడం పై అధికారుల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భర్త చనిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు అయినప్పటికీ వితంతు పింఛన్‌ ‌కొరకు దరఖాస్తు చేసుకున్నా నేటి వరకు పింఛను మంజూరు చేయలేదని జానికమ్మ తెలపగా గ్రామంలో దివ్యాంగులు వితంతువులు అర్హులైన వారి జాబితాను   పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.  తమ స్వాధీనంలో ఉన్న భూమిని  వేరే వ్యక్తుల పేరు మీద పట్టా జారీ చేశారని తమకు న్యాయం చేయాలని కోరగా తక్షణం విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని తాసిల్దార్‌ ‌కు సూచించారు.  దాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యపు రాశులు పేరుకు పోయి ఎందుకున్నాయని  పిఎసిఎస్‌ ‌చైర్మన్‌, ‌సీఈవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధాన్యం శాతాన్ని పరిశీలించిన ఆయన 9 శాతం  ఉండటంపై రైతుకు కలిగిన నష్టానికి పరిహారం మీరు చెల్లిస్తారా అంటూ పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధాన్యం ఎండి ఎండి 9 శాతానికి వచ్చినా కనీసం కనికరం లేకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాన్యం కొనుగోలు లో ఎందుకు జాప్యం జరుగు తోందని, తనకు ఎందుకు కథలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతులు ఇబ్బందులకు గురి చేసే సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్‌ ‌చేస్తామని ఆయన హెచ్చ రించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ కొనుగోలు చేయు విధానం గురించి  పలుమార్లు అధికారులకు సమావేశాలు,  టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించి తెలియ జేశామని,  ఎందుకు అలసత్వం  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌నిర్లక్ష్య సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే  పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌కు,  కేంద్ర ఇంచార్జి సీఈఓ కు షోకాజ్‌ ‌నోటీసులు జారీ చేయాలని డి సి ఓ ఆదేశించారు.  అర్హత ఉన్న వ్యక్తుల కు పింఛన్లు రావడం లేదని తమకు న్యాయం చేయాలని కోరగా విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలను అందచేయాలని ఎం• •డీవో కు సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎందుకు జాప్యం జరుగుతుందని ఎందుకు తనకు కథలు చెబుతున్నారు అని పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఉండాల్సిన పిఎసిఎస్‌ ‌చైర్మన్‌ ‌లోడింగ్‌ అన్‌ ‌లోడింగ్‌ అం‌టూ కథలు చెప్పటం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు అనంతరం గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లోని నర్సరీని సందర్శించిన మొక్కలు పెంచుతున్న విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు నర్సరీలో దాదాపు 12 వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు ఈజీ కార్యక్రమాలలో డిఆర్డిఎ పిడి మధుసూదన రాజు %•జూశీ% ఆశాలత మండల ప్రత్యేక అధికారి వరద రెడ్డి భద్రాచలం ఇన్చార్జి సబ్‌ ‌కలెక్టర్‌ ‌స్వర్ణలత ఎంపిడివో తాసిల్దార్‌ ‌తదితరులు పాల్గొన్నారు పరిశోధన రాజు చేయాలని ఆయన సూచించారు

Leave a Reply