Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తహసిల్దార్‌ ‌శ్రీనివాసులు

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్‌ ఎం ‌శ్రీనివాసులు హెచ్చరించారు గత ఐదు రోజుల క్రితం మండల పరిధిలోని ఆలేరు గ్రామ శివారులో గల గోల గుండం గ్రామంలో సర్వేనెంబర్‌ 241 ‌లో గల 34 ఎకరాల 21 గుంటల భూమిని 10 మంది వ్యక్తులు గుట్టల ను జెసిబి లతో చదును చేసి దొడ్లను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న చెట్లను నరికి వేసి చదును చేసి ఇండ్ల నిర్మాణం కోసం గుట్ట వెనుక భాగం నుండి జెసిబి లతో చదును చేసి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం తో చరవాణి లో సమాచారం అందుకున్న తాసిల్దార్‌ ‌శుక్రవారం ప్రజా ప్రతినిధులు రెవెన్యూ సిబ్బంది తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూములను అక్రమంగా అన్యాక్రాంతం చేస్తూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంత పెద్ద విషయాన్ని గ్రామానికి సంబంధించిన విఆర్‌ఏ, ‌వీఆర్వోలు తనకు సమాచారం ఇవ్వకపోవడం తో ఈ విషయంపై వారికి మెమోలు జారీ చేయనున్నట్లు వారు తెలిపారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విషయ సమాచారాన్ని ఏపీఓ శ్యామ్‌ ‌పంచాయతీ కార్యదర్శి లకు ఇచ్చినట్లు వారు తెలిపారు మూడు రోజుల్లో మొత్తం సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమినంతా స్వాధీనం చేసుకోనున్నట్లు వారు తెలిపారు అనంతరం హరితహారం మొక్కలు ఈ భూమిలో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు ఇక్కడ ఉన్న చెట్లను కొట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. ప్రజాప్రతినిధులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీఆర్వోలు వీఆర్‌ఏలు పాల్గొన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!