Take a fresh look at your lifestyle.

రెండున్నరేళ్లలో సాధించింది శూన్యం

అనంతపురం,సెప్టెంబర్‌ 24 : ‌వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోందిని మాజీమంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ప్రజల విశ్వాసం కోల్పోయిన జగన్మోహన్‌ ‌రెడ్డి సీఎంగా అనర్హుడని అన్నారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కళ్లు తెరవాలన్నారు. అధికారబలంతో ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని, ఇకనైనా జనరంజకంగా పాలన చేయాలని సూచించారు. భూకబ్జాలు, చెరువుల ఆక్రమణలు, వీటికి పోలీసులు సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు.

శాంతిభద్రతలను పరిరక్షించాలే గాని అనవసరంగా టిడిపి వారిపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. పెట్రోల్‌, ‌డీజల్‌, ‌గ్యాస్‌ ‌ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపాలని అన్నారు. రైతు రాజ్యం తెస్తామని ఎన్నికల ప్రచారంలో అర్భాటాలు పలికి, వారి ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ ‌రెడ్డి.. అన్ని రంగాల్లో రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్‌ ‌ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.  రాష్ట్రం అభివృద్ధి చెందటం జగన్‌కు ఇష్టం లేదని అందుకే తన ఇష్టం వచ్చినట్లుగా నిర్నయాలు తీసుకుంటున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు  కృషి చేస్తే ఆనాడి  దాన్ని ఎలా అడ్డుకోవాలా అని జగన్‌ ‌చేశారని అన్నారు.  రాజధాని అమరావతి నిర్మాణానికి అడ్డుతీగలడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా జగన్‌ ‌తన తప్పు తెలుసుకుని  సహకరించాలన్నారు.

Leave a Reply