Take a fresh look at your lifestyle.

తెలుగు రేడియో తొలి ప్రవక్త ఆచంట జానకిరాం

నేడు…ఆచంట జానకిరాం జయంతి

ఆచంట జానకిరాం సుప్రసిద్ధ రేడియో ప్రసార ప్రముఖులు, రచయిత. చిత్రకారులు.
జానకిరామ్‌ 1903 ‌జూన్‌ 16‌న జన్మించారు. ఆయన సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, ఆచంట సీతమ్మ, వ్కెద్యులు ఆచంట లక్ష్మీపతి కుమారులు.


ఆయన బాల్యం అంతా మద్రాసులో గడిచింది, అడయార్‌ ‌లో మొదటి యుద్ధం రోజుల్లో కొంత కాలం మదనపల్లిలో విద్యాభ్యాసం. ఆ రోజుల్లోనే అక్కడ స్కూల్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌గా ఉన్న జేంసు కజిన్సు శిష్యరికం. కజిన్సు జానకిరామ్‌కి చిత్ర కళలో అభిరుచి కల్పించారు. వారి సాంగత్యంలో తనెన్నో విషయాలు నేర్చుకున్నానని జానకిరామ్‌ ‌తెలియజేశారు. ఆయనకు దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు లను పరిచయం చేసింది కూడా కజిన్సే. ఆ రోజుల్లోనే హోమ్‌ ‌రూల్‌ ‌నాయకులు అనీ బిసెంట్‌ అరండేల్‌ ‌ల ప్రభావం పడింది. మదనపల్లి లో ఉండగానే అక్కడికి వచ్చిన రవీంద్రుడ్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది.
తండ్రి ఆచంట లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వ్కెద్యులు, సంఘ సంస్కర్త. వారి పెంపకంలో జానకిరామ్‌కి ఉత్తమ సంస్కారం పుణికి పుచ్చుకున్నారు. రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కుటుంబం అవటం వల్ల ఆ ప్రభావాలన్నీ ఆయన మీద ఉన్నాయి. చిన్నప్పట్నించీ సమకాలిక మహావ్యక్తుల పరిచయ భాగ్యం లభించింది. వీరేశలింగం, గురజాడ, ఉన్నవ లాంటి సంస్కర్తలు, రచయితలు తన తండ్రితో ఇష్టాగోష్టి జరుపు తున్నప్పుడు వినే అదృష్టం కలిగింది. అడయార్‌ ‌లో బి. ఎస్సీ. అయ్యాక వారు కొంత కాలం విజయనగరంలో, బెంగుళూరు ఇండియన్‌ ఇం‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ ‌లో రసాయన శాస్త్ర పరిశోధనలు చేశారు.


బెంగుళూరు పరిశోధనా జీవితం తర్వాత ఇన్స్యూరెన్సు కంపెనీ కార్యదర్శిగా బెజవాడ కేంద్రంగా పని చేశారు. ఆ రోజుల్లోనే ఆయనకు ఆంధ్ర ప్రదేశ్‌ ‌లోని కవి పండితులందరితో పరిచయం, స్నేహం పెరిగాయి. ఉద్దండుల్కెన కవులు, గాయకులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, అన్ని రంగాల్లోని నిష్ణాతులతో మ్కెత్రి ఏర్పడ్డమే కాక వారి ప్రేమానురాగాలు పొందారు. ఆ రోజుల్లోనే బసవరాజు అప్పారావు తో పరిచయం కలిగింది. కవి స్వంత గొంతుకలో ఆయన రాసిన గీతాలు విన్నారు. ఆ తర్వాత ఈ పాటలు టంగుటూరి సూర్యకుమారి ఆలాపించారు. అలాగే కృష్ణశాస్త్రి, వేదుల, అబ్బూరి, చలం లతో ప్రగాఢ మ్కెత్రి ఏర్పడింది.1935 భారత దేశం లో రేడియో ప్రసారాలు ప్రారంభమ్కెన కొత్తలోనే  రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. రేడియోలో పని చేసే రోజుల్లో  బుచ్చిబాబుతో పరిచయం, స్నేహం పెరిగాయి.
1938 జూన్‌ 16 ‌న మదరాసులో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ ‌గా ఆచంట జానకిరాం చేరారు. తొలి డైరక్టర్‌ ‌జనరల్‌ ‌లైనల్‌ ‌ఫీల్డెన్‌ ‌నియమించిన తొలి తరం వారిలో ఆచంట ఒకరు. సున్నితమైన మనస్సు, తెల్లని దుస్తులు ధరించి కార్యక్రమ రూపకల్పనలో మేటి అనిపించుకున్నారు జానకిరాం. మదరాసు కేంద్రం నుండి తొలి తెలుగు నాటకం ‘ అనార్కలి ‘ జానకిరాం ప్రయోక్తగా వెలువడింది.


కొంతకాలం ఢిల్లీలో దక్షిణ భారత ప్రసారాల విభాగంలో పని చేశారు. తర్వాత తిరుచిరాపల్లి కేంద్రంలో ప్రాగ్రాం ఎగ్జిక్యూటివ్‌ ‌గా పనిచేసి మదరాసు చేరారు. 120 పైగా తమిళ నాటకాలు మిత్రుల సాయంతో ప్రసారం చేశారు. ఆంధ్రదేశం నలుమూలల నుండి పండితులను పిలిపించి తెలుగు ప్రసంగాలు ఏర్పాటు చేశారు. 21 సంవత్సరాలు ఆకాశవాణిలో ప్రముఖ పదవులు నిర్వహించారు.


వాణి ఎడిటర్‌ ‌గా మదరాసు కేంద్రంలో ఒక దశాబ్దిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. జానకిరాం గొప్ప సౌజన్యమూర్తి, స్నేహశీలి, సౌమ్యుడు, భావుకుడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో పండితుడు. ఈ భాషల్లోనే మంచి కవిత్వాన్ని చదివి ఆస్వాదించిన రసికుడు. తను ఆస్వాదించిన దాన్ని పది మందికి పంచి ఇవ్వగల్గిన ప్రతిభావంతుడు. నాస్మృతిపథంలో, సాగుతున్న యాత్ర రచనలు చేశారు. జానకిరాం సున్నితమైన ఆధునిక చిత్రకళ లో ప్రావీణ్యం సంపాదించారు. 170కి పైగా స్వీయ చిత్రాలను ఆంధ్ర మహిళా సభకు బహూకరించారు.ఆయన సతీమణి ఆచంట శారదాదేవి పద్మావతీ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. సీతమ్మ  మరణం తరువాత ఆచంట లక్ష్మీపతి ఆచంట రుక్మిణమ్మ ను రెండవ  పెళ్లి చేసుకున్నారు. రుక్మిణమ్మ అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఆరోగ్యశాఖా మంత్రిణి గా ఆమె పని చేసారు. తమిళనాడు ప్రాంతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా, 1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పని చేశారు.


తన అరవ్కె ఏళ్ల జీవితానుభవాన్ని గురించి జానకిరాం…‘‘జీవితం ఒక రన్నింగ్‌ ‌రేస్‌. అం‌దరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. అందుచేత ఫలమెలా పరిణ మించినా మనం పట్టించు కోకూడదు. ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి. జానకిరాం పరిపూర్ణ జీవితం గడిపి తొంబై దాటాక తిరుపతిలో 1961 నుండి విశ్రాంత జీవనం గడిపి 1994లో 88 సంవత్సరాలకు తనువు చాలించి కీర్తి శేషులయ్యారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply