Take a fresh look at your lifestyle.

అత్యాచారయత్నంకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలి

జన్నారం, మే 20, ప్రజాతంత్ర విలేఖరి : గౌడ కులస్తురాలిపై అత్యాచార యత్నంకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. బుధవారం రోజున ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం గౌడ కులస్తుడైన కిషోర్‌ ‌కుమార్తెను కిడ్నాప్‌ ‌చేసి అత్యాయార యత్నంకు పాల్పడ్డ నిందితులను నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లెనియెడల మోకుదెబ్బ జిల్లా కమిటి, బిసి సంఘాల ఐక్య వేధిక తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. కిషోర్‌ ‌కుటుంబానికి పోలీసులు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు తిరుపతి గౌడ్‌, ‌వొల్లల నర్సాగౌడ్‌, ‌జన్నారం సర్పంచ్‌ ‌గంగాధర్‌ ‌గౌడ్‌, ‌సుభాష్‌ ‌గౌడ్‌, ‌సురేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply