Take a fresh look at your lifestyle.

పల్లె ప్రకృతివనం పనుల్లో వేగంపెంచండి: కలెక్టర్‌

‌సూర్యాపేట, జులై 16, ప్రజాతంత్ర ప్రతినిధి): పల్లెలు పచ్చదనంతో వెలగాలని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పరిధిలోని  చివ్వెంల మండలం తిమ్మాపురంలో పల్లెప్రగతివనం పనుల పురోగతిని కలెక్టర్‌ ‌పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పల్లెప్రకృతివనం కొరకు కేటాయించిన ఒక ఎకరం భూమిలో బౌండరీ వెంట పెద్ద నీడనిచ్చే వృక్షాల జాతి మొక్కలు పెంచడానికి, దాని వెంట లోపల వైపు 2వ వరుస దట్టమైన పొదలలాగా పెరిగే మొక్కలు, దాని తరువాత లోపలివైపు 3వ వరుసలో పూలమొక్కలు నాటాలని సూచించారు. అలాగే దాని వెంట లోపలి నడక దారికి 3గుంటల దూరం వదలగా ఇక మధ్య భాగంలో మిగిలిన 9గుంటలు బాగా సాంద్రతగా పెరిగే దట్టమైన వృక్షాలను పెంచాలని అన్నారు.

అదే విధంగా ప్రతి గ్రామంలో అన్ని రోడ్లు, వీధుల్లో, కాలిబాటలలో కూడా అవెన్యూ ప్లాంట్స్ ‌రెండు వైపులా అవకాశం ఉండే 3వరుసలా, లేకుంటే 2, కాకుంటే ఒక వరుసలోనయినా తప్పక మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఒక్కో రోడ్డుకు ఇరుప్రక్కలా ఎన్ని వరుసలలో ఏ రకమైన మొక్కలు నాటుతున్నారు అనే మొత్తం వివరాలు ఒక రిజిస్టర్‌లో నమోదు చేసుకొని కార్యదర్శి వద్ద సిద్దంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు విరివిరిగా నాటాలన్నారు. రోడ్లుకు ఇరుప్రక్కల టాల్‌ప్లాంట్స్ ‌మాత్రమే నాటాలన్నారు. ప్రక్క రాష్ట్రం నుండి అయిన మొక్కలను కొనుగోలు చేసుకోవొచ్చని తెలిపారు. వర్షాకాలం సీజన్లో మళ్ళీ కొత్త మొక్కలు నా•డానికి స్థలము దొరకనంతగా ఈ వర్షాకాలం సీజన్లో మన జిల్లాలో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జమల రెడ్డి, ఎమ్‌పిఓ, ఏపిఓ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!