అడిషనల్ కలెక్టర్ నగేష్ , అరుణ, ఆర్డీవో, నరసాపూర్ తహశీల్దార్ మాలతి, వీఆర్ఏ, వీఆర్ఓలతో కలిపి మొత్తం 12 మంది ఇళ్లల్లో ఏసీబీ అధికారులు ఏకాకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉప్పల్‌లోని ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో రూ. 20 లక్షల విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ నగేష్ భార్యను కొంపల్లిలోని తన నివాసానికి తరలించారు. నగేష్ బ్యాంక్ లాకర్‌ను తెరవనున్నారు.
నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు ఎన్ఓసి కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ. 1.40 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అడిషనల్ కలెక్టర్‌తో పాటు రెవెన్యూ సిబ్బందిఫై విచారణ చేపట్టారు. 25 రోజుల వ్యవధిలోనే కోటికి పైగా లంచం తీసుకుంటూ రెండో అవినీతి అధికారి పట్టుబడ్డారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం కేసులో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.