Take a fresh look at your lifestyle.

అన్ని అటానమస్‌ ‌కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌

  • అటానమస్‌ ‌ముసుగులో కొన్ని కళాశాల్లో నాసిరకం విద్య
  • డిగ్రీ విద్యలో నాణ్యత పెంచాలనే పరీక్షా విధానంలో మార్పులు
  • మిడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌

రాష్ట్రంలోని అన్ని అటానమస్‌ ‌కళాశాలల్లో అకడమిక్‌ ఆడిట్‌ ‌చేపడతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ‌స్పష్టం చేశారు. అటానమస్‌ ‌ముసుగులో కొన్ని కళాశాలలు నాసిరకం విద్యను అందిస్తున్నాయన్నారు. దీనిపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మిడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తమకు యూజీసీ ఆమోదం ఉందంటూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చని.. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు చేయొచ్చన్నారు. డిగ్రీ విద్యలో నాణ్యత పెంచాలనే ఉద్దేశంతోనే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు.

ఇకపై అటానమస్‌ ‌కళాశాలల్లో సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 109 కళాశాలలు అటానమస్‌ ‌హోదా పొంది సిలబస్‌ ‌రూపకల్పనతో పాటు సొంతంగా పరీక్షలు నిర్వహించాయని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితిని విద్యార్థులకు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఏప్రిల్‌ 9‌న జగనన్న విద్యాదీవెన కింది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.  విద్యాశాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్‌ను రానున్న ఉగాదికి క్యాలెండర్‌ ‌విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దిమూలపు సురేష్‌ ‌ప్రకటించారు.  వచ్చే నెల 9వ తేదీన జగనన్న విద్యా దీవెన కింద ఫీజులు చెల్లిస్తామని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి వైయస్‌ ‌జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా విద్యా బోధన చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ‌వెల్లడించారు. అక్రమాలకు పాల్పడే అటానమస్‌ ‌కాలేజీల తీరు మార్చకోకుంటే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అటానమస్‌ ‌కళాశాలలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 109 అటానమస్‌ ‌కాలేజీలు పలు యూనివర్శిటీల పరిధిలో ఉన్నాయన్నారు. తమ పరిధిలోని అటానమస్‌ ‌కాలేజీలకు ఆయా యూనివర్శీటీలే సిలబస్‌ ‌మొదలుకుని ప్రశ్న పత్రాల రూపకల్పన, మూల్యాంకనం వంటివి చేపడతున్నాయని అన్నారు. అటానమస్‌ ‌కాలేజీల్లో నాణ్యమైన విద్య అందడం లేదని గుర్తించామన్నారు. అటానమస్‌ ‌స్టేటస్‌ అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రభుత్వమిచ్చే రాయితీలను పొంది కొన్ని అటానమస్‌ ‌కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.

అటానమస్‌ ‌కాలేజీల విషయమై యూజీసీతో కూడా సంప్రదింపులు జరుపుతామన్నారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని.. కేంద్రమే కాదు.. రాష్ట్రమూ చట్టాలు చేయొచ్చునని మంత్రి పేర్కొన్నారు.యూజీసీ ఆమోదం ఉంది.. తమ జోలికి ఎవరూ రావద్దంటే కుదరదని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయన్నారు.

Leave a Reply