జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో పట్టపగలే ఒక ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని జ్యోతినగర్ కాలనీలోని సంగిరాజేష్ ఇంట్లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడడంతో 15తులాల బంగారం, 20తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.50వేల నగదు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తన స్వస్థలమైన వెల్మజాలకు వెళ్లి తిరిగి వచ్చి ఇంట్లో చూడగా దొంగతనం జరిగినట్లు తెలిసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న డీసీపీ బి శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇంటి పరసర ప్రాంతాలను పరిశీలించి క్లూస్ టీం సహాయంతో విచారణ చేపడుతామని తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వారిలో ఏసీపీ వినోద్‌కుమార్‌తో పాటు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.