Take a fresh look at your lifestyle.

‘ఎల్‌జీ పాలిమర్స్’ ‌బాధితులందరికీ ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున వెల్లడి

అమరావతి: ఎల్‌జీ పాలిమర్స్ ‌గ్యాస్‌ ‌లీకేజీ ఘటనలో అనారోగ్యం పాలైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందించాలని సీఎం వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, ఏ ఒక్కరూ పైసా చెల్లించకుండా ఆస్పత్రులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. గ్యాస్‌ ‌ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా ఎలాంటి ఫీజూ లేకుండా వైద్యానికి వెళ్లొచ్చు.సదరు ఆస్పత్రి ఆరోగ్యశ్రీ పరిధిలో లేకపోయినా సరే వైద్యం ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చాం.

ఇప్పటికే ఈ విషయాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ‌ద్వారా అన్ని ఆస్పత్రులకు సమాచారం అందించాం.వైద్యానికి వచ్చే బాధితుల ఆధార్‌ ‌కార్డు, ఇతర వివరాలను తీసు కుని చికిత్స చేయాలి. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైద్యం అనంతరం ఆస్పత్రులు సంబంధిత బిల్లులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపిస్తే సొమ్ము చెల్లిస్తాం. గ్యాస్‌ ‌ప్రభావిత ప్రాంతాల ప్రజలు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందాలని కోరుతున్నాం.అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. డా.డి.భాస్కరరావు, జిల్లా కోర్డినేటర్‌, 8333814019 ‌నంబర్‌కు కాల్‌ ‌చేస్తే వెంటనే స్పందిస్తారు.

Leave a Reply