Take a fresh look at your lifestyle.

ఆరోగ్య భారత్‌ ‌కోసం హ్యాపినెస్‌ ‌కిట్‌

‌లక్ష కిట్లు పంపిణీ చేయనున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ 

‌కొరోనా వైరస్‌ ‌మహమ్మారి దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను పేదరికంలోని నెట్టివేసింది. ఈ నేపథ్మంలో పేద వర్గాల పిల్లల ఆకలి, పోషకాహార లోపం, క్షుద్భాద తీర్చాలన్న లక్ష్యంతో వారి కుటుంబాలకు మద్దతుగా హ్యాపినెస్‌ ‌కిట్లను ప్రారంభించినట్లుగా అక్షయపాత్ర ఫౌండేషన్‌ ‌ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, దాతల భాగస్వామ్యంతో 2020 సెప్టెంబర్‌ ‌చివరి నాటికి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు తిరిగి పాఠశాలలు తెరిచే వరకూ లక్ష బహుళ వినియోగ కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల ఆరోగ్యం వారి ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడేందుకు వారి రోజువారీ వినియోగానికి అవసరమైన పోషకాలను అందించే ఆహార పదార్థాలు హ్యాపినెస్‌ ‌కిట్‌లో ఉంటాయి.

ఈ కిట్‌లో పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు, వేరుశనగ, బెల్లం, బిస్కట్లతో పాటు ఇతర ఆహార పదార్థాలు వారి కుటుంబ పోషణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఆహార ధాన్యాల పంపిణీతో సంబంధం లేకుండా పంపిణీ చేయనుంది. గ్లూకోజ్‌, ఐరన్‌, ‌కాల్షియం, అయోడిన్‌, ‌ప్రొటీన్‌ ‌వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఈ సందర్భంగా  అక్షయపాత్ర ఫౌండేషన్‌ ‌సీఈవో శ్రీధర్‌ ‌వెంకట్‌ ‌మాట్లాడుతూ భారతీయులుగా మానవ వనరుల డివిడెండ్‌ను పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా కోవిడ్‌ 19 ‌మహమ్మారి కారణంగా బడులు మానేసిన పిల్లల పోషక, విద్యావసరాలను తీర్చడానికి తాము తయారు చేసిన హ్యాపినెస్‌ ‌కిట్‌ను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 11 వేల కిట్లను పంపిణీ చేశామనీ, ఈనెల చివరి లోగా దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసి తమ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply