Take a fresh look at your lifestyle.

పక్కాగా ఆరోగ్య ఆసరా పథకం

  • ఎమర్జెన్సీ సేవలకు కూడా లోటూ రాకుండా చూడాలి
  • సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి
  • టెలీమెడిసిన్‌ ‌కోసం కొత్త బైక్‌లను కొనుగోలు
  • చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్‌
  • అధికారులను ఆదేశించిన సీఎం జగన్‌

అమరావతి,మే 13 :  టెలీమెడిసిన్‌ ‌కోసం కొత్త బైక్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఎమర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ రాకుండా చూడాలన్నారు. బుధవారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై సక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ‌పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్‌ ‌వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని చెప్పారు.షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్‌ ‌చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారని సీఎం జగన్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం‌లు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించామని వెల్లడించారు. ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్‌ ‌కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలని సిఎం జగన్‌ అన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే టెలి మెడిసిన్‌ ‌కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలుఇచ్చారు. చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్‌ ‌కల్పించాలని, రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా చూడాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం ఇచ్చారు. దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలని, దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలన్నారు. చేపలకు ధర, మార్కెటింగ్‌ ‌విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం ఆదేశించారు. అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్‌ ఇతర రాష్ట్రాల్లో  లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌కు సీఎం ఆదేశించారు. రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌ ‌కల్పించాని,కోల్డ్ ‌స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ ‌యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని,  మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌, ‌హెల్త్ ‌స్పెషల్‌ ‌సీఎస్‌ ‌జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply