Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో..ఆప్‌ ‌విజయం ప్రజాస్వామ్యానికి అత్యవసరం

AAP's victory, Delhi imperative, democracy

ఇటీవల కాలంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం క్రూరత్వానికి మారుపేరుగా తయారైంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులపై ముసుగు వీరులు దాడి చేసినప్పుడు, జామియా యూనివర్సిటీ ఘటనల సమయంలోనూ శాంతి భద్రతల పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తింది. ఇప్పటికీ అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే పని చేస్తోంది. ప్రజాస్వామికంగా తన బాధ్యతను విస్మరిస్తోంది. ఢిల్లీ పోలీసుల క్రూరత్వాన్ని అడ్డుకునే శక్తి తక్షణావసరం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలంతో కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఎత్తుగడలతో కానీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ సారథి కేజ్రీవాల్‌ ‌సరిపోలిన వాడు కాదు కానీ, ప్రస్తుత పరిస్థితులో ఆయన నేతృత్వంలోని ఆప్‌ ‌విజయం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. దేశ రాజధాని ఢిల్లీకి అంతకన్నా అవసరం. వొచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ఆప్‌ ‌విజయం ఢిల్లీ అభివృద్ధికి అత్యవసరం. బీజేపీ గెలిస్తే గణతంత్ర దేశానికి పెను ముప్పు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు అటువంటివి. ఢిల్లీలో కాంగ్రెస్‌ అ‌ప్రదిష్టపాలైన, అగౌరవకరమైన మనుషులతో నిండిన పార్టీగా తయారైంది. అంత మాత్రాన అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కడిగిన ముత్యంలాంటిది కాదు. వైఫల్యాలేమీ లేనిదీ కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీజేపీని ఓడించడం ముఖ్యం. ఢిల్లీ పోలీసు యంత్రాంగాన్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చేసే వాదన పేలవంగా ఉన్నా, అందులో కొంత సహేతుకత ఉండవచ్చు. దేశ రాజధాని నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా కేంద్రం చేతిలో ఉంటాయి. ఆధునిక కాలంలో శాంతి భద్రతల యంత్రాంగం అణచివేత శక్తిగా మారిపోయింది. ఆ యంత్రాంగం పై అధికారుల అదుపాజ్ఞల్లో పని చేస్తోంది. ఇటీవల కాలంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం క్రూరత్వానికి మారుపేరుగా తయారైంది.

ఇందులో అనుమానం ఏమీ లేదు. ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులపై ముసుగు వీరులు దాడి చేసినప్పుడు, జామియా యూనివర్సిటీ ఘటనల సమయంలోనూ శాంతి భద్రతల పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తింది. ఇప్పటికీ అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే పని చేస్తోంది. ప్రజాస్వామికంగా తన బాధ్యతను విస్మరిస్తోంది. ఢిల్లీ పోలీసుల క్రూరత్వాన్ని అడ్డుకునే శక్తి తక్షణావసరం. పోలీసులను ప్రజాస్వామిక జవాబుదారీతనం పరిధిలోకి తీసుకుని రావల్సిన అవసరం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వోటు వేస్తే పోలీసుల క్రూరత్వాన్ని సమర్థించినట్టే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనోజ్‌ ‌తివారీ కానీ, విజయ గోయల్‌ ‌కానీ, వీరిరువురిలో ఎవరొచ్చినా కేంద్ర హోం మంత్రి అదుపాజ్ఞలలో పని చేస్తారు. బేజపీ నాయకులు ఇప్పటికే ప్రచారంలో చెబుతున్నదేమంటే ప్రధాని నరేంద్రమోడీ ముఖం చూసి వోటు వేయండని వోటర్లను కోరుతున్నారు. అయితే, మోడీ కానీ, అమిత్‌ ‌షా కానీ ఢిల్లీ వాసులు కారు, గుజరాత్‌కు చెందిన వారు. ఆప్‌ ‌కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసింది. గడిచిన ఐదేళ్ళలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు జేసింది. యువతీ, యవకులను సేకరించి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఢిల్లీ ప్రజలకు అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌కొత్త కాదు. అమిత్‌ ‌షా లాంటి వాడు కాడు, అమిత్‌ ‌షా వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. ఇందుకు జార్కండ్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరో సారి భంగ పాటు తప్పదు.

Tags: AAP’s victory, Delhi imperative, democracy

Leave A Reply

Your email address will not be published.