Take a fresh look at your lifestyle.

నాల్గవ పానిపట్ యుద్దం… ఆప్ విజయం దేశానికి అవసరం

“ఢిల్లీ అసెంబ్లీకి ఎల్లుండి (ఫిబ్రవరి 8వ తేదీ) జరిగే ఎన్నికలు నాల్గవ పానిపట్ యుద్దం వంటివి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం భారత ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరమని సంతోష్ అడ్డగుళ్ళ పేర్కొంటున్నారు.’ఆప్ ‘ అభిమాని సంతోష్ అడ్డగుళ్ల కాలిఫోర్నియా ఫ్రీమాంట్ లో ఓకే ఐ టి కంపెనీ లో ఉద్యోగి.”

130 feet statue,Gandhi Sangareddy,hyderabad

ఢిల్లీ శాసనసభకు శనివారం నాడు జరిగే ఎన్నికలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి దేశ ప్రజలు యావన్మంది ఢిల్లీ ప్రజలు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించేందుకు బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. బీజేపీ తరఫున 200 మంది పార్లమెంటు సభ్యులు, 11 మంది ముఖ్యమంత్రులు, 70 మంది మంత్రులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారానికి తానే ముందుండి పార్టీ నాయకులనూ, శ్రేణులనూ నడిపిస్తున్నారు. ప్రధాన మంత్రి సంగతి సరేసరి. పార్లమెంటు సమావేశాలతో ఎంత బిజీగా ఉన్నా సమయం వ చ్చినప్పుడు తాను కూడా ప్రచారాన్ని సాగిస్తున్నారు. అంటే బీజేపీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో స్పష్టం అవుతోంది. బీజేపీ నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ పై వివాదాస్పద ప్రకటనలు చేయడం,వాటిని ఆయన తనకు అనుకూలంగా మలుచుకుంటూ తన చాతుర్యాన్ని ప్రదర్సించడం ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నాల్గవ పానిపట్ యుద్ధంగా అభివర్ణించవచ్చు. గడచిన మూడు యుద్ధాల కంటే ఈ యుద్ధం భారత భవిష్యత్ ను తేల్చనుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ భారీ మెజారిటీతో గెలవచ్చు. బీజేపీ కన్నా ఆప్ ముందంజలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లు తమ పార్టీకి ముఖ్యమంత్రులు ఎవరో ప్రకటించకపోవడం ఆప్ కి కలిసొచ్చే అంశం. ఈ రెండు పార్టీల్లో కేజ్రీవాల్ తో సమానమైన నాయకుడు కానీ, ఆయనకున్న జనాకర్షణ శక్తిగల నాయకుడు గానీ లేరు. కేజ్రీవాల్ ఈసారి చాలా సానుకూలమైన రీతిలో ప్రచారం సాగించారు.అంటే ప్రత్యర్దులపై విమర్శనాస్త్రాలను సంధించకుండా, తాను చేసిన మంచి పనుల గురించి ప్రజల హృదయాలను హత్తుకుని పోయే రీతిలో వివరిస్తూ ప్రచారం సాగించారు. ఈ సానుకూల ప్రచారం ఆయనకు కలిసొస్తుందని అనుభవనీయులైన రాజకీయ వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు.

సీఏఏ, ఎన్ ఆర్ సీ వంటి వివాదాస్పద అంశాల విషయంలో కూడా ఆయన ఏమాత్రం కట్టు తప్పకుండా ప్రసంగాలు చేయడం అందరినీ ఆకర్షించింది. అలాగే, 370వ అధికరణం రద్దు, ఎన్ పీఆర్, షహీన్ బాగ్ సంఘటన, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ లో జరిగిన నిరసనలు మొదలైన అంశాలపై ఆయన ప్రదర్శించిన సంయమనం ఎంతో కలిసొచ్చింది. హిందూ, ముస్లిం వర్గాలను వేరు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న వేళ, ఈ రెండు వ ర్గాలకు కావల్సిన వ్యక్తిగా కేజ్రీవాల్ చాలా హుందాగా, నేర్పరితనంతో వ్యవహరించడం అందరినీ ఆకర్షించింది. గడిచిన ఐదేళ్ళలో తమ పార్టీ ప్రభుత్వం అమలు జేసిన సంక్షేమ,అభివృద్ది కార్యక్రమాల గురించే ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఢిల్లీలో గడిచిన ఐదేళ్లుగా ఆదర్శ పాలనను అందిస్తున్నామని ఆయన చెబుతూ జనాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించారు., ముఖ్యంగా విద్యా రంగంలో ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, మేలు చేకూర్చే అంశాలను ఆయన ప్రజలకు హత్తుకుని పోయే రీతిలో వివ రిస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగా బడ్జెట్ లో ఐదు శాతం నిధులను కేటాయిస్తూ వచ్చింది. 22,000 తరగతి గదులను నిర్మించింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో కన్నా ఇది చాలా ఎక్కువ. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచింది. వాటి ముఖ చిత్రాలను మార్చేసింది. ఉపాధ్యాయులను అమెరికా, లండన్, సింగపూర్ తదితర దేశాల్లో శిక్షణకు పంపించింది. ఇళ్ళ నిర్వహణకు ఎస్టేట్ మేనేజర్లను నియమించింది. ఎస్టేట్ మేనేజర్ల ఫోన్ యాప్ ద్వారా వారి పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చింది. ఆరోగ్యం విషయంలో కూడా ఆప్ ప్రభుత్వం ఎంతో శ్రద్ద తీసుకుంది. 450 మొహల్లా క్లినిక్ లనూ, 29 పోలీ క్లినిక్ లను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ లలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. మందులు, వైద్య సేవలు అందిస్తోంది.

- Advertisement -

ప్రతి ఇంటికీ 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తోంది. దీంతో నీటిని పొదుపుగా వాడుకునేరీతిలో ప్రజలను అలవాటు పర్చింది. అవినీతి, పాలనా వ్యవహారాల్లో లోపాలను అరికట్టింది. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా సరఫరా చేస్తోంది. 200 యూనిట్లు దాటితే చౌక ధరకు సరఫరా చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఢిల్లీలో విద్యుత్ సరఫరా పరిస్థితి ఎంతో మెరుగుగా ఉంది. నిరంతర విద్యుత్ సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకుంటోంది. దేశ రాజధాని నగరంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని 23 వంతెనలను రికార్డు టైమ్ లో నిర్మించింది. ఆజాద్ పూర్ ఫ్లయిఓవర్ మంజూరు అయిన నిధులకు లోబడి నిర్మించి 100 కోట్ల రూపాయిలను ఆదా చేసింది. భలస్వా ఫ్లయిఓవర్ ను 20 కోట్ల ఆదా చేసి నిర్మించింది. ప్రజారవాణాను మెరుగు పర్చేందుకు పెక్కు చర్యలు తీసుకుంది. మహిళలకు డిటిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మహిళల భద్రతకు పెక్కు చర్యలు తీసుకుందతి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 3 లక్షల సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుల భద్రత కోసం బస్సుల్లో 13 వేల మంది బస్సు మార్షల్స్ ను నియమించింది. జనన ధ్రువీకరణ పత్రాలు, కొత్తగా కుళాయి కనెక్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్ ల పునరుద్ధరణ ఇళ్ళ వద్దనే సేవలందించే సౌకర్యాన్ని కల్చిది.

ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సృజనాత్మక పథకం వల్ల ప్రమాదాల నుంచి 3,500 మంది బయటపడ్డారు., ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చే వారికి 2వేల రూపాయిల నగదుతో పాటు యోగ్యతా పత్రాన్ని అందించే పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమలు జేస్తోంది. 2015లో ఉమన్న బడ్జెట్ ను రెట్టింపు చేసింది., అంటే 32,000 కోట్ల నుంచి 60,000కోట్లకు పెంచింది. గడిచిన ఐదేళ్ళుగా రెవిన్యూ మిగులుతో పాలన సాగిస్తోంది. అమరులైన సైనికుల కుటుంబాలకు చెందిన వారికి కోటి రూపాయిల వంచున సమ్మాన్ రాశి అనే ఎక్స్ గ్రేషియో పథకాన్ని దేశం మొత్తం మీద అమలు జేస్తున్న రాష్ట్రం ఢిల్లీయే. అమరులైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు కూడా ఇది వర్తిస్తుంది. నగర వీధులను తుడిచేందుకు 200 పైగా ఆటోమేటిక్ పరిశుభ్రత యంత్రాలను ప్రవేశ పెట్టింది. షహీన్ బాగ్ అంశాన్ని బీజేపీ కేజ్రీవాల్ పై దాడి చేసేందుకు బీజేపీ ఉపయోగించుకుంటున్న నేపద్యంలో ఆయన ఎంతో ఓర్పుతో, నేర్పుతో కమలనాధుల ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. సానుకూల ప్రచారంతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. కేజ్రీవాల్ అవినీతి రహిత పాలనను అందించారు అందులో సందేహం లేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు.

పైన పేర్కొన్న అభిప్రాయం వ్యాస కర్త వ్యక్తిగతం

Leave a Reply