Take a fresh look at your lifestyle.

ఆదిపరాశక్తి !

ఆపదల నుండి రక్షించే
ఆదిపరాశక్తి నీవేనమ్మా
సకలజనుల సౌభాగ్యాల
వరదాయిని కనకదుర్గామాత
అమ్మలగమ్మ అమ్మా !
ముల్లోకాలను కాచే
మూలశక్తివి నీవేనమ్మా..
వర్తమాన కాలస్థితిలో
స్త్రీజాతిని అత్యాచారాల
శాపగ్రస్తత నుండి విముక్తం
చేయవమ్మా !
పురుషాహంకార అగ్నికీలల్లో
సమిధలౌతున్న అభాగినుల
పక్షాన రౌద్రకాళివై నిర్నిద్రనేత్రివై
వేంచేయవమ్మా తల్లీ..
కలియుగ రాక్షసుల్ని
చీల్చిచెండాడు చాముండీ
అంబపరమేశ్వరీ, అఖిలాండేశ్వరీ
ఆదిపరాశక్తి గౌరీ కామాక్షీ
మహాదేవీ,  కాళీమాత
అబలల్ని ఆదుకోవమ్మా
ఆనంద రూపిణివై ఏతెంచి
మహిళా వైభవమే పండుగగా
మానప్రాణ సంరక్షణివై
శరన్నవరాత్రుల వెలుగుల్ని
మానవతుల జీవితాల్లో నింపవమ్మా.. !!

–  భీమవరపు పురుషోత్తమ్‌,

దీఇన్నీస్‌ ‌పేట,  రాజమహేంద్రవరం
9949800253

Leave a Reply