Take a fresh look at your lifestyle.

127 మందికి ‘ఆధార్’ నోటీసులు

'Aadhaar' notices to 127 persons

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ హైదరాబాద్ లో 127 మందికి ఆధార్ సంస్థ(యూఐడిఏఐ) నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డులు పొందినట్టు పేర్కొంటూ వారికి ఈ ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరుడని నిరూపించుకునేందుకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 20వ తేదీన ఒరిజినల్ ధ్రువ పత్రాలతో విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశాలలో పేర్కొన్నారు.

భారత పౌరసత్వం కలిగివుంటే తగిన పత్రాలను చూపించాలని సరైన పత్రాలు చూపకపోయినా…విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని నోటీసులో ఆధార్ సంస్థ(UADAI) పేర్కొన్నట్టు చెబుతున్నారు. CAA, NRC పై దుమారం రేగుతున్న ఈ తరుణంలో ఆధార్ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్ది సేపటి క్రితం ఈ విషయం మీద ఆధార్ సంస్థ స్పందించింది. కొన్ని సందర్భాలాలో తప్పుడు పత్రాలతో ఆధార్ సంపాదించినట్టయితే ఆ కార్డులను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల సేకరణకు గడువు కావాలని పోలీసులు పేర్కొనడంతో సమావేశాన్ని మేకి వాయిదా వేసినట్టు ప్రకటించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply