Take a fresh look at your lifestyle.

పాన్‌ ‌కార్డుకు ఆధార్‌ ‌లింక్‌ ‌తప్పనిసరి

  • మార్చి 31లోగా చేయించుకోవాలి
  • ఆర్థిక బిల్లులో కేంద్రం కీలక సవరణ

పాన్‌ ‌కార్డుతో ఆధార్‌ ‌కార్డును లింక్‌ ‌చేసుకోవాలని ఆర్థిక బిల్లులో కేంద్రం కీలక సవరణ చేసింది. ఒకవేళ లింక్‌ ‌చేయించుకోకపోతే మాత్రం ఈ నెల 31 లోగా తప్పకుండా లింక్‌ ‌చేయించడం తప్పనిరి చేసింది. లేదంటే ఆధార్‌ ‌కార్డు పనిచేయకుండా పోవడమేగాక, జరిమానా కూడా చెల్లించాల్సి వొస్తుంది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆర్థిక బిల్లు-2021కి కీలక సవరణ చేసి ఆమోదించింది. ఆ సవరణ ప్రకారం ఇన్‌కం ట్యాక్స్ ‌చట్టం-1961లో కొత్తగా 234హెచ్‌ ‌సెక్షన్‌ను చేర్చింది. ఆ కొత్త సెక్షన్‌ ‌ప్రకారం పాన్‌కార్డు ఉన్న వాళ్లంతా ఆధార్‌ ‌కార్డుతో దాన్ని లింక్‌ ‌చేయించుకోవాలి.

లేదంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వొస్తుంది. అయితే, ఆ జరిమానా ఎంత అనే విషయాన్ని ప్రభుత్వం త్వరలోనే నిర్ణయించనుంది. కాగా, జరిమానా మొత్తం రూ.1000కి మించకుండా ఉండవొచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి. సవరించిన చట్టం ప్రకారం పాన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 31లోగా ఆధార్‌తో తమ పాన్‌ ‌సంఖ్యను అనుసంధానం చేయించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజా బ్జడెట్‌ ‌ప్రతిపాదనలు 2021, ఏప్రిల్‌ 1 ‌నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ ప్రభుత్వం పాన్‌, ఆధార్‌ అనుసంధానం గడువును గనుక పొడిగించకపోతే.. మార్చి 31లోగా అనుసంధానం చేయించనివారు రూ.1000కి మించకుండా జరిమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం.. ఏ వ్యక్తినైనా తన పాన్‌ను సమర్పించాలని అధికారులు కోరినపుడు ఆ వ్యక్తి తన పాన్‌ను సమర్పించకపోయినా, పనిచేయని పాన్‌ను సమర్పించినా ఆ వ్యక్తి అధిక టీడీఎస్‌ ‌లేదా టీసీఎస్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్‌కం ట్యాక్స్ ‌రిటర్న్‌లను దాఖలు చేయడం సాధ్యం కాకపోవొచ్చు. ఇన్‌కం ట్యాక్స్ ‌రిటర్న్‌లను సమయానికి దాఖలు చేయకపోతే దానికి సంబంధించిన పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.

Leave a Reply