Take a fresh look at your lifestyle.

‌ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌తప్పనిసరి… కేంద్రం కీలక నిర్ణయం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రతీ ఒక్క పథకానికి ఇదే ఆధారం. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరి చేరే విధంగా ఉండవు. భారత్‌ ‌లో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌కార్డు ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధార్‌ ‌కేంద్రాల ద్వారా సేవలను అందుబాటులో ఉంచింది. అయితే తాజాగా పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది. పిల్లల ఆధార్‌ ‌కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ ‌నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్‌ ‌కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.

తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్‌ ‌నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్‌ ‌బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్‌ ‌ప్రభాకరన్‌ ఆదేశాలు జారీ చేశారు. 5 ఏళ్లలోపు ఆధార్‌ ‌తీసుకునేందుకు వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తు ఫారమ్‌ ‌తో దరఖాస్తలు చేసు కోవాల్సి ఉంటుంది. 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి వేరే దరఖాస్తు ఫారం ఉంటుందని యూఐడీఏఐ పేర్కొంది. దానికి సంబంధించిన మరో కొత్త దరఖాస్తు నమూనా ఫారంను యూఐడీఏఐ రిలీజ్‌ ‌చేసింది.

ఇక దీంతో పాటు.. 18 ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తులకు మరో ఫారమ్‌ ‌లో దరఖాస్తు ఫారం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ రకంగా మొత్తం మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ రిలీజ్‌ ‌చేసింది. వీటి ద్వారా మాత్రమే ఆధార్‌ ‌కార్డులు పొందాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి వీటిని అందుబాటులో ఉంచారు. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యూఐడీఏఐ ఇక నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్‌ ‌తీసుకోవాలన్నా.. లేక వాళ్ల ఆధార్‌ ‌లో ఏమైనా తప్పులను కరెక్షన్‌ ‌చేయాలన్నా.. తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆధార్‌ ‌నంబర్లు ఉండాల్సిందే.

Leave a Reply